కేరళలో ప్రముఖ మహిళా యాక్టివిస్ట్ రెహానా ఫాతిమా మరోసారి వార్తల్లో నిలిచారు. అర్ధనగ్న శరీరంపై తన కొడుకు, కుతురుతో డ్రాయింగ్ వేయించుకుంటూ ఆమె వీడియో తీసింది. ఆపై దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ‘బాడీ ఆర్ట్స్ అండ్ పాలిటిక్స్’ పేరిట పోస్టు చేసిన ఆ వీడియో కొద్ది నిమిషాల్లోనే వైరల్ అయింది. దీనికి సంబంధించి ఆమెపై తీవ్ర విమర్శలు రావడంతో పాటు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ కూడా కూడా జారీ అయ్యింది. దీంతో.. ముందస్తు బెయిల్ కోరుతూ కేరళ హైకోర్టును ఆశ్రయించారు ఈ విమెన్ యాక్టివిస్ట్.
కాగా, 2018లో అయ్యప్ప దర్శనానికి మహిళలు వెళ్లేందుకూ అనుమతిస్తూ సుప్రీంకోర్టు ఆదేశాల తర్వాత.. ఆలయ ప్రవేశానికి ప్రయత్నించి సంచలనం సృష్టించిన ఆమె.. తాజాగా ఈ వివాదంతో మరోసారి వార్తల్లో వ్యక్తిగా నిలిచారు. అప్పట్లో హిందూవులను ఉద్దేశించి సామాజిక మాధ్యమాల్లో ఆమె చేసిన పోస్టులు కలకలం రేపాయి. దీంతో ఆమెపై కేసు నమోదైంది. 18 రోజుల పాటు జైలు శిక్ష కూడా అనుభవించారు రెహానా ఫాతిమా.