ధ‌ర‌ణి పోర్ట‌ల్‌లో వ్య‌వ‌సాయేత‌ర ఆస్తుల రిజిస్ట్రేష‌న్.. న‌వంబ‌ర్ 23 నుంచి ప్రారంభ కానున్న ప్రక్రియ

|

Nov 21, 2020 | 3:57 PM

తెలంగాణలో వ్య‌వ‌సాయేత‌ర ఆస్తుల రిజిస్ట్రేష‌న్ల‌ ప్రక్రియకు రంగం సిద్ధమవుతోంది. ఈ నెల 23 నుంచి ధ‌ర‌ణి పోర్ట‌ల్‌లో వ్య‌వ‌సాయేత‌ర ఆస్తుల రిజిస్ట్రేష‌న్ ప్రారంభంకానుంది. దీంతోపాటు మ్యుటేష‌న్లు పూర్తికానున్నాయి.

ధ‌ర‌ణి పోర్ట‌ల్‌లో వ్య‌వ‌సాయేత‌ర ఆస్తుల రిజిస్ట్రేష‌న్.. న‌వంబ‌ర్ 23 నుంచి ప్రారంభ కానున్న ప్రక్రియ
Follow us on

Dharani Non-Agricultural : తెలంగాణలో వ్య‌వ‌సాయేత‌ర ఆస్తుల రిజిస్ట్రేష‌న్ల‌ ప్రక్రియకు రంగం సిద్ధమవుతోంది. ఈ నెల 23 నుంచి ధ‌ర‌ణి పోర్ట‌ల్‌లో వ్య‌వ‌సాయేత‌ర ఆస్తుల రిజిస్ట్రేష‌న్ ప్రారంభంకానుంది. దీంతోపాటు మ్యుటేష‌న్లు పూర్తికానున్నాయి. రెవెన్యూ సంస్క‌ర‌ణ‌ల్లో భాగంగా రాష్ట్ర‌ప్ర‌భుత్వం ధ‌ర‌ణి పోర్ట‌ల్‌ను రూపొందించింది.

ఇప్ప‌టికే వ్య‌వ‌సాయ భూముల రిజిస్ట్రేష‌న్లు ప్రారంభ‌మ‌య్యాయి. ఇప్పుడు వ్య‌వ‌సాయేత‌ర భూముల రిజిస్ట్రేష‌న్ల‌కు ప్ర‌భుత్వం ఏర్పాట్లు పూర్తిచేసింది. ఇందులో భాగంగా న‌వంబ‌ర్ 23న‌ చిక్క‌డ‌ప‌ల్లి స‌బ్‌రిజిస్ట్రేష‌న్ కార్యాల‌యంలో ప్ర‌భుత ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సోమేశ్ కుమార్ ప్రారంభించ‌నున్నారు. దీంతో రాష్ట్రంలో 75 రోజుల త‌ర్వాత వ్యవసాయేత‌ర ఆస్తుల రిజిస్ట్రేష‌న్లు అందుబాటులోకి రానున్నాయి.

ధ‌ర‌ణి పోర్ట‌ల్‌తో రిజిస్ట్రేష‌న్ ప్ర‌క్రియ ప‌ది నిమిషాల్లోనే పూర్తికానుంది. రిజిస్ట్రేష‌న్ కార్యాల‌యంలోనే మ్యుటేష‌న్ ప్ర‌క్రియ కూడా పూర్తికానుంది. కాగా, ఈ నెల 2 నుంచి వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు జరుగుతుండగా, రాష్ట్రంలోని 141 స‌బ్‌రిజిస్ట్రార్‌ కార్యాల‌య్యాల్లో ఎల్లుండి నుంచి వ్య‌వ‌సాయేత‌ర ఆస్తుల రిజిస్ట్రేష‌న్లు కూడా అందుబాటులోకి రానున్నాయి.