వర్షాల రాకను పసిగట్టలేకపోయారా?

| Edited By:

Oct 04, 2019 | 5:56 PM

దేశంలో మునుపెన్నడూ నమోదుకానంత వర్షపాతం నమోదైంది. ఇప్పటికీ వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా బీహార్‌లో కొన్ని ప్రాంతాలు వర్షం నీటిలోనే ఉన్నాయి. కర్ణాటక, మహారాష్ట్ర సహా పలు రాష్ట్రాల్లో కురిసిన వర్షాలు జనజీవనాన్ని అతలాకుతలం చేసిన సంగతి తెలిసిందే. నిలువ నీడను కోల్పోయి అస్తవ్యస్తంగా మారిన పరిస్థితులతో బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీసే పరిస్థితి వచ్చింది. ఈసారి నమోదైన వర్షపాతం దాదాపు 25 ఏళ్ల వర్షపాతంతో సమానంగా చెబుతున్నారు వాతావరణ అధికారులు.   సాధారంణంగా నైరుతి రుతుపవనాలు ప్రవేశించినప్పటి […]

వర్షాల రాకను పసిగట్టలేకపోయారా?
Follow us on

దేశంలో మునుపెన్నడూ నమోదుకానంత వర్షపాతం నమోదైంది. ఇప్పటికీ వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా బీహార్‌లో కొన్ని ప్రాంతాలు వర్షం నీటిలోనే ఉన్నాయి. కర్ణాటక, మహారాష్ట్ర సహా పలు రాష్ట్రాల్లో కురిసిన వర్షాలు జనజీవనాన్ని అతలాకుతలం చేసిన సంగతి తెలిసిందే. నిలువ నీడను కోల్పోయి అస్తవ్యస్తంగా మారిన పరిస్థితులతో బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీసే పరిస్థితి వచ్చింది. ఈసారి నమోదైన వర్షపాతం దాదాపు 25 ఏళ్ల వర్షపాతంతో సమానంగా చెబుతున్నారు వాతావరణ అధికారులు.

 

సాధారంణంగా నైరుతి రుతుపవనాలు ప్రవేశించినప్పటి నుంచి వర్షాలు కురవడం ప్రారంభమవుతుంది. కొద్ది రోజులు అటు ఇటుగా అవి పలు రాష్ట్రాలను తాకుతాయి. అయితే ఆ తర్వాత కురిసే వర్షాలను అంచనా వేయడంలో భారత వాతావరణ శాఖ విపలమైనట్టుగా ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. తుఫానులను అంచనా వేయడంలో వాతావరణ శాఖపై విమర్శలు వస్తున్నాయి. సాధారణంగా వర్షాల రాకను.. అల్పపీడనాలు ఏర్పడే పరిస్థితులపై అధికారులు ముందుగానే అంచానా వేస్తారు. దీనిద్వారా రైతులు, మత్య్సకారులు తగిన జాగ్రత్తలు తీసుకునే వీలుంటుంది. కానీ ఈ ఏడాది అంచనాలను మించి వర్షపాతం నమోదు కావడంతో వాతావరణ శాఖ అధికారులే ఆశ్చర్య పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

వాతారణ శాఖ అధికారులు చెప్పిన ప్రకారం ఈ ఏడాది 97 శాతం వర్షపాతం నమోదయ్యే ఛాన్స్ఉంది. కానీ వీరి అంచనాలు తప్పి ఏకగా 110 శాతం వర్షపాతం రికార్డ్ కావడంతో వారినే ఆశ్చర్యపరిచింది. ఏదిఏమైనా మర వాతావరణ శాఖ సరైన విధంగా స్పందించలేదని, తుపానులపై మందస్స్తు హెచ్చరికలు జారీ చేయడంలో విఫలమైందనే విమర్శలు వెల్లువెత్తున్నాయి.