
రియల్‌మీ భారత మార్కెట్లోకి మరో కొత్త ఫోన్‌ను లాంచ్ చేస్తోంది. రియల్‌మీ జీటీ నియో 3 పేరుతో తీసుకురానున్న ఈ ఫోన్ ఏప్రిల్ 29న ఇండియాలో లాంచ్ కానుంది. ఈ ఫోన్‌ను తక్కువ ధరలో ఆకట్టుకునే ఫీచర్లను అందించనున్నారు.

మీడియా టెక్ డైమంసిటీ 8100 ప్రాసెసర్‌పై పనిచేసే ఈ స్మార్ట్‌ఫోన్‌లో 120 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో కూడిన 6.7 ఇంచెస్ ఫుల్ హెచ్‌డీ+అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించారు. ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేస్తుంది.

ఈ ఫోన్‌లో 150 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ చేసే 4500 బ్యాటరీని అందించారు. ఇన్‌డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్‌తో పాటు డ్యుయల్ సిమ్, 5జీ, 4జీ ఎల్‌టీఈ, వైఫై 6ఈ, బ్లూటూత్, జీపీఎస్, ఎన్‌ఎఫ్‌సీ, వంటి ఫీచర్లు ఉన్నాయి.

కెమెరా విషయానికొస్తే ఈ ఫోన్‌లో 50 మెగా పిక్సెల్ సోనీ ఐఎమ్‌ఎక్స్766 రెయిర్ కెమెరాతో పాటు, సెల్ఫీల కోసం 16 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరాను అందించారు.

ఈ స్మార్ట్ ఫోన్ ధర వివరాల్లోకి వెళితే.. 80 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ చేసే ఫోన్ ధర రూ. 24,000 కాగా, 150 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్ ఫోన్ ధర రూ. 33,000గా ఉండనుంది.