అప్పటివరకు సిటీ బస్సు సర్వీసులు లేనట్లే..!

హైదరాబాద్‌లో లాక్‌డౌన్‌ కారణంగా నిలిచిపోయిన సిటీ బస్సు సర్వీసులపై ఈ నెల 8వ తేదీన జరిగే సీఎం సమీక్ష తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటామని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ స్పష్టం చేశారు.

  • Ravi Kiran
  • Publish Date - 11:40 am, Thu, 4 June 20
అప్పటివరకు సిటీ బస్సు సర్వీసులు లేనట్లే..!

హైదరాబాద్‌లో లాక్‌డౌన్‌ కారణంగా నిలిచిపోయిన సిటీ బస్సు సర్వీసులపై ఈ నెల 8వ తేదీన జరిగే సీఎం సమీక్ష తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటామని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ స్పష్టం చేశారు. సిటీ ఆర్టీసీపైన ప్రస్తుతం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్న ఆయన.. కరోనా వ్యాప్తిలో తగ్గుదల కనిపిస్తేనే సిటీలో బస్సులు తిరుగుతాయని వెల్లడించారు.

ఆర్టీసీ సమ్మె, కరోనా ఎఫెక్ట్‌తో సంస్థ తీవ్ర నష్టాల్లో ఉందన్నారు. అంతేకాకుండా హైదరాబాద్‌లో 78 రోజులుగా సిటీ బస్సులు నిలిచిపోవడంతో ఆర్టీసీ ఆదాయంపై భారీగా గండిపడిందన్నారు. ప్రజలు ఆర్టీసీని ఆదరించి సంస్థను ఆదుకోవాలని మంత్రి తెలిపారు. ప్రస్తుతం కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉన్న నేపధ్యంలో ఇప్పట్లో సిటీ బస్సులను నడిపే అవకాశం లేదన్నారు. కాగా, కరోనా నేపధ్యంలో సిటీలో తిరిగే బస్సుల్లో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని.. అందుకే ఆచితూచి అడుగులు వేస్తున్నట్లు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ వెల్లడించారు.

Also Read:

ఏపీలో కొన్ని స్టేషన్లలోనే ఆగనున్న రైళ్లు.. వారికి డబ్బులు రీఫండ్..

వైఎస్ఆర్ వాహనమిత్ర.. వారి ఖాతాల్లోకి రూ.10 వేలు జమ..

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇకపై భూములకు ‘భూధార్’..

ఇక నుంచి సచివాలయాల్లోనే రేషన్ కార్డులు..!

సినిమా థియేటర్ల రీ-ఓపెన్‌పై కేంద్రం క్లారిటీ..!