ఈ మూలికలు క్యాన్సర్‌ను నయం చేస్తాయట..ఎక్కడ దొరుకుతాయంటే..!

|

Feb 26, 2020 | 7:05 PM

ఉత్తరాఖండ్​లోని హిమాలయ పర్వతాలు ఎంత అందంగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే కనువిందు చేసే ప్రక‌ృతితో పాటు ఎన్నో ఔషధ మూలికలకు ఈ పర్వతగిరిలో కొలువుతీరి ఉన్నాయి.

ఈ మూలికలు క్యాన్సర్‌ను నయం చేస్తాయట..ఎక్కడ దొరుకుతాయంటే..!
Follow us on

ఉత్తరాఖండ్​లోని హిమాలయ పర్వతాలు ఎంత అందంగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే కనువిందు చేసే ప్రక‌ృతితో పాటు ఎన్నో ఔషధ మూలికలకు ఈ పర్వతగిరిలో కొలువుతీరి ఉన్నాయి. ప్రజల ప్రాణాలు తీసే క్యాన్సర్ లాంటి భయంకర మహమ్మారిని సైతం తరిమికొట్టే గుణం ఇక్కడ ఉండే ఔషధ మొక్కల్లో ఉందనే ప్రచారం జరుగుతోంది. అక్కడ లభించే బద్రీ బెర్రీ అనే ఔషధ మొక్కకు ఎన్నో ప్రత్యేకమైన గుణాలు ఉన్నాయి. బీపీ, షుగర్, కిడ్నీలో రాళ్లు, లివర్ సమస్యలు వంటివి ఉన్నవారికి ఈ మొక్క ఎంతో ఉపయోగకారిగా మారింది. అందుకే అక్కడి ప్రజలు బద్రీ బెర్రీని సాగు చేస్తూ..దానిపైనే ఉపాధిగా పెంపొందించుకుంటున్నారు.

దేశ ప్రధాని మోదీ కూడా హిమాలయాల్లోని మొక్కల ఔషధ గుణాలపై ఎన్నో బహిరంగ వేదికల్లో ప్రస్తావించారు. 2018 పెట్టిబడిదారుల సదస్సు నేపథ్యంలో అక్కడ పర్యటించిన ప్రధానికి..ఈ మొక్క నుంచి తీసిన 1.5 లీటర్ల రసాన్ని స్థానికులు అందజేశారు. బద్రీ బెర్రీ నూనె వెల రూ. 1000 నుంచి రూ. 1500 మధ్య ఉంటుంది. కాగా ఎత్తైన హిమాలయ పర్వతశ్రేణిలో మాత్రమే ఈ మొక్కలు పెరుగుతాయి.

ఇది కూడా చదవండి : “రెండేళ్లుగా పెన్షన్ లేదయ్యా”..చలించిపోయిన కలెక్టర్..