త్రివిక్రమ్ కథ.. వెంకీ కుడుముల దర్శకత్వం.. రామ్ హీరో.. సిద్ధవుతోన్న క్రేజీ కాంబినేషన్?

|

Dec 23, 2020 | 8:36 PM

హీరో రామ్ తర్వాతి చిత్రం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో చేయనున్నాడని అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే తాజాగా వినిపిస్తోన్న సమచారం ప్రకారం..

త్రివిక్రమ్ కథ.. వెంకీ కుడుముల దర్శకత్వం.. రామ్ హీరో.. సిద్ధవుతోన్న క్రేజీ కాంబినేషన్?
Follow us on

Ram team up with venky kudumula: ‘ఈస్మార్ట్ శంకర్’ వంటి బ్లాక్ బ్లస్టర్ విజయాన్ని అందుకున్న తర్వాత హీరో రామ్ నటిస్తోన్న చిత్రం ‘రెడ్’. నిజానికి ఈ చిత్ర షూటింగ్ ఇప్పటికే పూర్తి కావాల్సి ఉండగా కరోనా కారణంగా వాయిదా పడింది. తాజాగా కేంద్రం ప్రకటించిన అన్‌లాక్‌లో భాగంగా రెడ్ షూటింగ్ తిరిగి ప్రారంభించింది. ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. ఇదిలా ఉంటే ఈ సినిమా తర్వాత రామ్ నటించబోయే సినిమా ఏంటనే చర్చ జరుగుతోంది.
రామ్ తర్వాతి చిత్రం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో చేయనున్నాడని అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే తాజాగా వినిపిస్తోన్న సమాచారం ప్రకారం ఈ సినిమాకు త్రివిక్రమ్ దర్శకత్వం వహించట్లేదని, అతడి శిష్యుడైన వెంకీ కుడుముల దర్శకత్వం చేస్తున్నాడని తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఈ చిత్రానికి త్రివిక్రమ్ కథ అందించనున్నట్లుగా సమాచారం. మరి ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాలి.