”మహారాష్ట్రకు కాబోయే సీఎం కంగనా, అర్నబ్ గోస్వామి పీఎం”

బాలీవుడ్ ఫైర్‌బ్రాండ్ కంగనా రనౌత్, శివసేన సర్కార్ మధ్య వార్ కొనసాగుతోంది. ఆమె ఇటీవల మహా సర్కార్‌కు వ్యతిరేకంగా పలు ఘాటు వ్యాఖ్యలు చేయడమే కాకుండా...

మహారాష్ట్రకు కాబోయే సీఎం కంగనా, అర్నబ్ గోస్వామి పీఎం

Updated on: Sep 09, 2020 | 5:53 PM

Kangana Vs ShivSena: బాలీవుడ్ ఫైర్‌బ్రాండ్ కంగనా రనౌత్, శివసేన సర్కార్ మధ్య వార్ కొనసాగుతోంది. ఆమె ఇటీవల మహా సర్కార్‌కు వ్యతిరేకంగా పలు ఘాటు వ్యాఖ్యలు చేయడమే కాకుండా సుశాంత్ కేసుకు సంబంధించి బాలీవుడ్‌లో పలువురు డ్రగ్స్ తీసుకుంటున్నారంటూ సంచలన కామెంట్స్ చేసింది. దీనితో ఆమె ప్రాణాలకు ముప్పు ఉన్న నేపథ్యంలో కేంద్రం ‘వై ప్లస్’ కేటగిరీ భద్రతను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఇక వీరిద్దరి మధ్య కొనసాగుతున్న వార్‌పై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఆసక్తికర ట్వీట్లు చేశారు.

Also Read: ‘మనసు మమత’ శ్రావణి ఆత్మహత్య కేసులో మరో ట్విస్ట్..

చూస్తుంటే కంగనా మహారాష్ట్రకు కాబోయే సీఎం అయ్యేలా కనిపిస్తోంది. ఒకవేళ అదే జరిగితే అప్పుడు బాలీవుడ్ ప్రముఖులంతా తట్టాబుట్టా సర్దుకోవాల్సిందేనని ట్వీట్ చేశారు. అంతేకాదు కంగనా రనౌత్ సీఎం అయినప్పుడు.. అర్నబ్ గోస్వామి పీఎం అవుతారు. శివసేన కనుమరుగవుతుంది. ముంబై పోలీసుల స్థానంలో రిపబ్లిక్ టీవీ ఉంటుంది. కాంగ్రెస్ ఇటలీకి పారిపోతుందని” ఆర్జీవీ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

అలాగే ”కరోనా వైరస్ సోకిన ఇండియాకు వ్యాక్సిన్ ఎలా లేదో.. కంగనా సోకిన శివసేనకు కూడా వ్యాక్సిన్ లేదంటూ” ఆర్జీవీ మరో ట్వీట్ చేశారు.

Also Read: విశాఖను భయపెడుతున్న కొత్త వైరస్.. జనాల్లో హడల్..

Loading...
Unable to load recommendations.
Follow Us