రామ్ గోపాల్ వర్మ పరువుహత్య మూవీ ‘మర్డర్’ ట్రైలర్

సంచలనాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈ కరోనా మహమ్మారిని ఎన్‌క్యాష్ చేసుకోవడంలో ఈ ప్రపంచం లోనే ముందున్నట్టున్నాడు. సినిమాలను చిల్లరపెంకుల్లా తీసి పడేస్తున్నాడు. ఒకదాని వెంట ఒకటి ఏకబిగిన సినిమాలు చేస్తూ అన్ని రకాల ప్రయోగాలూ చేస్తూ ఆస్వాదిస్తూ సొమ్ము చేసుకుంటున్నాడు. ఈ క్రమంలో పవర్ స్టార్ దగ్గర్నుంచి కరోనా వరకూ మధ్యలో ఇటీవల జరిగిన ముఖ్యమైన ఘటనల్ని తెరకెక్కిస్తూ సొమ్ము చేసుకుంటున్నాడు. ఇలాంటిదే ‘దిశ ఎన్ కౌంటర్’ కాగా, మరొకటి ‘మర్డర్’. మిర్యాల గూడలో […]

రామ్ గోపాల్ వర్మ పరువుహత్య మూవీ మర్డర్ ట్రైలర్

Updated on: Oct 10, 2020 | 3:28 PM

సంచలనాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈ కరోనా మహమ్మారిని ఎన్‌క్యాష్ చేసుకోవడంలో ఈ ప్రపంచం లోనే ముందున్నట్టున్నాడు. సినిమాలను చిల్లరపెంకుల్లా తీసి పడేస్తున్నాడు. ఒకదాని వెంట ఒకటి ఏకబిగిన సినిమాలు చేస్తూ అన్ని రకాల ప్రయోగాలూ చేస్తూ ఆస్వాదిస్తూ సొమ్ము చేసుకుంటున్నాడు. ఈ క్రమంలో పవర్ స్టార్ దగ్గర్నుంచి కరోనా వరకూ మధ్యలో ఇటీవల జరిగిన ముఖ్యమైన ఘటనల్ని తెరకెక్కిస్తూ సొమ్ము చేసుకుంటున్నాడు. ఇలాంటిదే ‘దిశ ఎన్ కౌంటర్’ కాగా, మరొకటి ‘మర్డర్’. మిర్యాల గూడలో జరిగిన పరువు హత్య నేపథ్యంలో సాగిన ఈ ‘మర్డర్’ సినిమా ట్రైలర్ ను రామ్ గోపాల్ వర్మ శనివారం రిలీజ్ చేశాడు. రాము లేటెస్ట్ మూవీస్ అయిన ‘కరోనావైరస్’, ‘మర్డర్’ సినిమాల్లో కీలక పాత్ర పోషించిన శ్రీకాంత్ అయ్యంగార్ పుట్టిన రోజు వేళ రాము బ్యాక్ టు బ్యాక్ రెండు సినిమాల ట్రైలర్లు రిలీజ్ చేశాడు.