నవంబర్ 9న రాజ్యసభ ఎన్నికలు

|

Oct 14, 2020 | 2:18 PM

మరోసారి రాజ్యసభ ఎన్నికల నగారా మోగింది. త్వరలో ఖాళీ కానున్న 11 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఎన్నికల షెడ్యూలును ప్రకటించింది.

నవంబర్ 9న రాజ్యసభ ఎన్నికలు
Follow us on

Rajyasabha elections in November: కొత్తగా ఖాళీ అయిన 11 రాజ్యసభ సీట్లకు గానీ నవంబర్ 9వ తేదీన ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఇందులో 10 రాజ్యసభ స్థానాలు ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందినవి కాగా.. మిగిలిన ఒకటి ఉత్తరాఖండ్ రాష్ట్రానికి సంబంధించినది. 11 రాజ్యసభ సీట్లకు నవంబర్ 9వ తేదీన ఎన్నికలు నిర్వహించనున్నట్లు షెడ్యూల్ ప్రకటించింది సీఈసీ. ఈ పదకొండు మంది రాజ్యసభ సభ్యుల పదవీకాలం నవంబర్ 25వ తేదీన ముగుస్తుండగా.. నవంబర్ 9వ తేదీన జరగనున్న ఎన్నికల్లో విజయం సాధించిన వారు నవంబర్ 25 నుంచి పదవిలో కొనసాగుతారు.

కాగా.. ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ తిరుగులేని మెజారిటీతో ప్రభుత్వంలో వున్న నేపథ్యంలో అక్కడి పది రాజ్యసభ స్థానాలను బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే గెలుచుకునే అవకాశం వుంది. అదే సమయంలో ఉత్తరాఖండ్‌కు చెందిన మరొక స్థానాన్ని కూడా బీజేపీ గెలుచుకునే పరిస్థితి వుంది. ఈ ఎన్నికల తర్వాత రాజ్యసభలో బీజేపీ (ఎన్డీయే) మరింత మెరుగయ్యే అవకాశాలున్నాయి.

Also read: అక్టోబర్ 28న కృష్ణా రివర్ బోర్డు భేటీ

Also read: కోలుకున్న గేల్.. బెంగళూరుతో మ్యాచ్‌కు రెడీ