కరోనా ఎఫెక్ట్ : జీతాల కోతల బిల్లుకు రాజ్యసభ ఆమోద ముద్ర

|

Sep 18, 2020 | 8:13 PM

కోతల బిల్లుకు రాజ్యసభ ఆమోద ముద్ర వేసింది. ఎంపీలు, కేంద్ర మంత్రుల వేతనాలు, భత్యాల్లో30 శాతం మేర తగ్గించే బిల్లులకు రాజ్యసభ శుక్రవారం ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. మంత్రుల జీతాలు, భత్యాల...

కరోనా ఎఫెక్ట్ : జీతాల కోతల బిల్లుకు రాజ్యసభ ఆమోద ముద్ర
Follow us on

కోతల బిల్లుకు రాజ్యసభ ఆమోద ముద్ర వేసింది. ఎంపీలు, కేంద్ర మంత్రుల వేతనాలు, భత్యాల్లో30 శాతం మేర తగ్గించే బిల్లులకు రాజ్యసభ శుక్రవారం ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. మంత్రుల జీతాలు, భత్యాల (సవరణ) బిల్లు 2020, పార్లమెంటు సభ్యుల జీతం, భత్యాలు, పెన్షన్ (సవరణ) బిల్లు 2020ను కేంద్ర మంత్రులు జీ కిషన్ రెడ్డి, ప్రల్హాద్ జోషి రాజ్యసభలో ప్రవేశపెట్టారు.

కరోనా నుంచి కోలుకుని పార్లమెంట్ సమావేశాలకు దూరంగా ఉన్న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తరుఫున ఈ బిల్లులను ప్రవేశపెట్టినట్లు వారు సభకు వెల్లడించారు. కాంగ్రెస్, బిజు జనతాదళ్ (BJD) ఇతర పార్టీల ఎంపీలు ఈ బిల్లులకు మనస్ఫూర్తిగా మద్దతు ఇచ్చారు.

అయితే ఎంపీలాడ్స్ నిధులను త్వరగా పునరుద్ధరించాలని కేంద్రాన్ని కోరారు. కరోనా సంక్షోభం నేపథ్యంలో ఎంపీల నియోజకవర్గాల్లోని ప్రజల కోసం చేపట్టే సహాయ కార్యక్రమాలకు ఈ నిధులు ఉపయోగపడతాయని చెప్పారు. గత ఏడాది ఎంపీలాడ్స్ బకాయిలను కూడా విడుదల చేయాలని ఏఐఏడీఎంకే ఎంపీ విజయకుమార్, బీజేడీ ఎంపీ ప్రసన్న ఆచార్య సభలో డిమాండ్ చేశారు.