పోలీస్ బ్యారికేడ్లను విరగ్గొట్టి , ఢిల్లీ చేరేందుకు రాజస్తాన్ రైతుల భారీ ర్యాలీ,ట్రాక్టర్లు, ట్రాలీల మార్చ్, ఖాకీల లాఠీచార్జ్, టియర్ గ్యాస్ ప్రయోగం

| Edited By: Anil kumar poka

Dec 31, 2020 | 8:47 PM

రైతు చట్టాలను వ్యతిరేకిస్తూ ఢిల్లీ బోర్డర్ లో ఆందోళన చేస్తున్న అన్నదాతలను కలుసుకునేందుకు రాజస్తాన్ నుంచి పెద్ద సంఖ్యలో రైతులు ర్యాలీగా బయలుదేరారు.

పోలీస్ బ్యారికేడ్లను విరగ్గొట్టి , ఢిల్లీ చేరేందుకు  రాజస్తాన్ రైతుల భారీ ర్యాలీ,ట్రాక్టర్లు, ట్రాలీల మార్చ్, ఖాకీల లాఠీచార్జ్, టియర్ గ్యాస్ ప్రయోగం
Follow us on

రైతు చట్టాలను వ్యతిరేకిస్తూ ఢిల్లీ బోర్డర్ లో ఆందోళన చేస్తున్న అన్నదాతలను కలుసుకునేందుకు రాజస్తాన్ నుంచి పెద్ద సంఖ్యలో రైతులు ర్యాలీగా బయలుదేరారు. గురువారం హర్యానా-రాజస్తాన్ సరిహద్దుల్లోకి వీరు చేరగా అడ్డుకునేందుకు పోలీసులు బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. అయితే రైతులు వాటిని విరగ్గొట్టి దూసుకుపోవడానికి యత్నించడంతో పోలీసులు వాటర్ క్యానన్లను, బాష్పవాయువును ప్రయోగించారు. లాఠీ ఛార్జి చేశారు. కానీ దీన్ని పట్టించుకోకుండా  దాదాపు 25 ట్రాక్టర్లు, ట్రాలీలతో వారు బ్యారికేడ్లను ఛేదించుకుంటూ వెళ్లినట్టు పోలీసులు తెలిపారు. వీరిలో చాలామంది యువకులని, తాము నచ్ఛజెప్పబోయినా వారు వినకుండా తమపట్ల దురుసుగా ప్రవర్తించారని వారు చెప్పారు.

ఈ స్థలం వద్ద కొన్ని రోజులుగా అన్నదాతలు ధర్నా చేస్తున్నారు. హర్యానాలోని కొందరు రైతులు తమ నిరసనను పట్టించుకోలేదని రాజస్థాన్ రైతు సంఘ నేత ఒకరు చెప్పారు. కాగా గురువారం రైతుల ఆందోళన గురించి ముఖ్య వార్తలు రాకపోవడం ఆశ్చర్యం కలిగించిందని అంటున్నారు. అన్నదాతలు కేంద్ర హామీలతో కొంతవరకు తృప్తి చెందారా అని భావిస్తున్నారు. తాజాగా జరిగిన చర్చల సందర్భంలో రైతులు ఢిల్లీ విజ్ఞాన్ భవన్ లో కేంద్రం ఏర్పాటు చేసిన ఫుడ్ ని స్వీకరించడం ఇందుకు నిదర్శనంగా ఉందని అంటున్నారు. గతంలో లంచ్ సమయంలో కేంద్రం ఇవ్వజూపిన ఆహారాన్ని వారు తిరస్కరించిన విషయం గమనార్హం.