
ఏపీలో అల్పపీడన ద్రోణీ కొనసాగుతున్న నేపథ్యంలో కురుస్తోన్న భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. పలు గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. మరో రెండు, మూడు రోజులు వర్షాలు తీవ్రత ఉండొచ్చని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఈ క్రమంలో విశాఖ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ప్రమాదకర పరిస్థితులు ఉంటే వారిని సురిక్షిత ప్రాంతాలకు తరలించాలని కలెక్టర్ వినయ్ చంద్ అధికారులకు సూచించారు. అత్యవసరసాయం కోసం కంట్రోల్ రూమ్ నంబర్లు ఏర్పాటు చేశారు. జిల్లా కలెక్టరేట్, రెవెన్యూ డివిజన్ ఆఫీసులు, తహసీల్దార్ ఆఫీసుల్లో కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు చేశారు. పోలీస్, రెవిన్యూ, ఇతర ప్రభుత్వ విభాగాలు సమన్వయంతో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని కలెక్టర్ ఆదేశించారు.
కంట్రోల్ రూమ్ నంబర్లు