రయ్ మంటూ దూసుకొస్తున్న రాఫెల్

|

Jul 27, 2020 | 4:57 PM

రాఫెల్.. రక్షణ మంత్రిత్వ శాఖ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోన్న ఈ యుద్ధ విమానాలు భారత్‌కు రాబోతోన్నాయి. భారత రక్షణ శాఖ ఎదురుచూస్తున్న రాఫెల్ యుద్ధ విమానాలు ఫ్రాన్స్ ‌ నుండి భార‌త్‌ కు బయలుదేరాయి. చేరనున్నాయి.

రయ్ మంటూ దూసుకొస్తున్న రాఫెల్
Follow us on

రాఫెల్.. రక్షణ మంత్రిత్వ శాఖ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోన్న ఈ యుద్ధ విమానాలు భారత్‌కు రాబోతోన్నాయి. భారత రక్షణ శాఖ ఎదురుచూస్తున్న రాఫెల్ యుద్ధ విమానాలు ఫ్రాన్స్ ‌ నుండి భార‌త్‌ కు బయలుదేరాయి. ఇస్‌ట్రెస్ ఎయిర్‌ బేస్ నుంచి బయల్దేరిన ఐదు రాఫెల్‌ ఫైటర్‌ జెట్స్‌ .. యూఏఈలోని అబుదాబి సమీపంలోని అల్దాఫ్రా ఫ్రెంచ్ ఎయిర్‌బేస్ వద్ద ఎయిర్‌ బేస్‌ లో బ్రేక్ స్టాప్ తీసుకోనున్నాయి. సుమారు 7,364 కిలోమీట‌ర్లు ప్రయాణించి ఎల్లుండి అంబాలా ఎయిర్‌ ఫోర్స్ బేస్‌ కు చేరుకోనున్నాయి.

 

36రాఫెల్‌ ఫైటర్‌ జెట్స్‌ కొనుగోలుకు ఫ్రాన్స్‌ తో కేంద్రం ఒప్పందం కుదుర్చుకోగా.. 36మంది ఐఏఎఫ్ పైల‌ట్లు వీటి కోసం ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నారు. కాగా, ఒప్పందం ప్రకారం ఆ విమానాలు దశల వారీగా దేశానికి చేరనున్నాయి. తొలిదశలో భాగంగా వస్తోన్న ఈ ఐదు యుద్ధ విమానాల్లో రెండు ట్రైనర్ విమానాలు, మూడు యుద్ధ విమానాలు ఉన్నాయని సంబంధిత అధికారులు తెలిపారు. ఈ నెల 29న హర్యానాలోని అంబాలాకు చేరుకోనున్న ఐదు రాఫేల్ యుద్ధ విమానాలు చేరుకోవాల్సి ఉంది. అనుకున్న సమయానికే అవి చేరుతున్నాయి.