అమ్మాయిలు ఎక్కడికి వెళ్లినా పెప్పర్ స్ప్రే దగ్గర పెట్టుకోండి.. : రాశీ

ఊహలు గుసగుసలాడే మూవీతో ఎంట్రీ ఇచ్చిన అందాల బొమ్మ రాశీ ఖన్నా.. అనతికాలంలోనే మంచి క్రేజ్ తెచ్చుకుంది. వరుస చిత్రాలతో బిజీ బిజీగా ఉన్న రాశీ.. తన ఫిట్‌నెస్‌పై స్పెషల్ ఫోకస్ పెట్టింది. కెరీర్ ప్రారంభంలో బొద్దుగా ఉన్న రాశీ.. ప్రస్తుతం స్లిమ్‌గా తయారైంది. వరుస చిత్రాలతో ప్రేక్షకులను అలరించేందుకు రాశీ ఖన్నా రెడీ అయ్యింది. ప్రస్తుతం వెంకీమామ, ప్రతీ రోజూ పండగే అంటూ హడావిడి చేస్తున్న రాశీ ఖన్నా.. తాజాగా వెంకీమామ మూవీ విశేషాలను గురువారం […]

అమ్మాయిలు ఎక్కడికి వెళ్లినా పెప్పర్ స్ప్రే దగ్గర పెట్టుకోండి.. : రాశీ
Follow us

| Edited By:

Updated on: Dec 06, 2019 | 6:00 AM

ఊహలు గుసగుసలాడే మూవీతో ఎంట్రీ ఇచ్చిన అందాల బొమ్మ రాశీ ఖన్నా.. అనతికాలంలోనే మంచి క్రేజ్ తెచ్చుకుంది. వరుస చిత్రాలతో బిజీ బిజీగా ఉన్న రాశీ.. తన ఫిట్‌నెస్‌పై స్పెషల్ ఫోకస్ పెట్టింది. కెరీర్ ప్రారంభంలో బొద్దుగా ఉన్న రాశీ.. ప్రస్తుతం స్లిమ్‌గా తయారైంది. వరుస చిత్రాలతో ప్రేక్షకులను అలరించేందుకు రాశీ ఖన్నా రెడీ అయ్యింది. ప్రస్తుతం వెంకీమామ, ప్రతీ రోజూ పండగే అంటూ హడావిడి చేస్తున్న రాశీ ఖన్నా.. తాజాగా వెంకీమామ మూవీ విశేషాలను గురువారం మీడియాతో పంచుకుంది. ఈ సందర్భంగా అనేక విషయాలను వెల్లడించింది.

మీరు తెలుగు బాగానే మాట్లాడుతున్నారే..? అవును.. ఇప్పుడు నేను తెలుగమ్మాయిని అయిపోయా..

వెయిట్ బాగా తగ్గినట్లున్నారు..? అవును. చాలా తగ్గాను. జిమ్‌లో చాలా కష్టపడ్డాను. షూటింగ్, జిమ్.. ఇవే నా లైఫ్ అయిపోయాయి. వెయిట్ తగ్గించుకోవాలనే దానికంటే ఫిట్‌గా ఉండాలనే దానిపైనే ఎక్కువ దృష్టి పెట్టాను.

ఎంత వెయిట్ తగ్గారు..? వెయిట్ ఎంత తగ్గామన్న దానికంటే.. ఫిట్ నెస్‌ కంట్రోల్‌ ఉంచుకోవడం ముఖ్యం. అది సినిమా ఇండస్ట్రీకి కావాల్సిన రిక్వైర్ మెంట్ కూడా. ఫిట్‌నెస్‌ పెంచుకునే దానిపైనే ఎక్కువ ఫోకస్ చేస్తాను. ఫ్యాట్‌ను తగ్గించుకొని, మజిల్స్‌ను స్ట్రాంగ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాను. గతంతో కంపేర్ చేస్తే.. ఇప్పుడు చాలా ఫిట్‌గా ఉన్నా.. క్యారెక్టర్ డిమాండ్ చేస్తే తప్ప ఇలాగే ఉండాలనుకుంటున్నా.

‘వెంకీమామ’లో మీ క్యారెక్టర్ ఏంటి? వెంకీమామలో.. నా రోల్ పేరు హారిక. ఒక ఫిలింమేకర్. ఒకరోజు అనుకోకుండా మా మేనేజర్‌కు సురేశ్‌బాబు ఫోన్ చేశారు. అప్పుడు నేను పాండిచ్చేరిలో తమిళ్ ఫిల్మ్ ‘అయోగ్య’ షూటింగ్‌లో ఉన్నాను. ఇంతకు ముందే నేను చైతూతో కలిసి ‘మనం’లో గెస్ట్ అప్పీయరెన్స్ ఇచ్చాను. ఆ మూవీకి ఒక రోజే పనిచేశాను. అతనితో కలిసి వర్క్ చెయ్యాలంటే.. ఇంటెన్స్ లవ్‌స్టోరీ అయితే బాగుంటుందనేది అప్పటి వరకు నాలో ఉన్న అభిప్రాయం. అయితే ఈ చిత్రంలో ఆఫర్ వచ్చినా కూడా నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే వెంకీ, చైతూ కలిసి నటిస్తున్న చిత్రం కావడం.. ఆ ఇద్దరూ మేనమామ మేనల్లుళ్లు కావడం. అంతేకాదు.. ‘ప్రేమం’లో కూడా ఆ ఇద్దరూ కలిసి ఒక సీన్‌లో నటించారు. ఆ ఇద్దరూ కలిసి నటించాలని వాళ్ల అభిమానులు కూడా కోరుకుంటున్నారు. ‘జై లవ కుశ’లో ఇదివరకే నేను డైరెక్టర్ బాబీతో పనిచేశాను. అందువల్ల కంఫర్ట్ లెవల్ బాగుంటుందనుకుని వచ్చేశాను. ఇక నా సీన్లు ఎక్కువగా ఫస్టాఫ్‌లో ఉన్నాయి. సెకండ్ ఆఫ్ కథ ఎక్కువగా మామా అల్లుళ్ల మధ్య ఎమోషనల్ సీన్స్‌తో వెళ్తుంది.

ఒక్క హీరో ఉంటేనే.. హీరోయిన్లకు చాన్స్ తక్కువ.. మరి ఇద్దరు హీరోలుంటే చాన్స్ వస్తుందనుకున్నారా..? అలా ఏం లేదు. ఇప్పటికే ఇద్దరు ఉన్న సినిమాలు చేశాను. అది అసలు సమస్యే కాదు. నాకు మంచి క్యారెక్టర్ ఉంటే చాలు. చెయ్యడానికి అభ్యంతరమే ఉండదు. ఆడియన్స్ నా క్యారెక్టర్‌ను గుర్తుంచుకుంటే చాలు. ఎవరేం క్యారెక్టర్ చేస్తున్నారనేది చూడటం నా పని కాదు. గతంలో మలయాళంలో హీరోయిన్ కాకపోయినా కూడా మంచి రోల్ చేశాను. ‘వెంకీమామ’లో మా నలుగురి క్యారెక్టర్లనూ బాబీ బాగా రాశారు.

ఎప్పట్నుంచి మీరు వెంకీ గారికి ఫ్యాన్ అయ్యారు? నా చిన్నప్పట్నుంచే వెంకీ గారికి ఫాన్ అయ్యాను. టీవీలో ఆయన హిందీ డబ్బింగ్ మూవీస్ చూసేదాన్ని. అప్పటినుంచే ఆయన సినిమాలంటే ఇష్టం. అంతకంటే ఒక వ్యక్తిగా ఆయనంటే నాకు చాలా రెస్పెక్ట్. ఆయన వెరీ స్పిరుచ్యువల్, వెరీ నైస్ పర్సన్.

సింగర్‌గా కూడా బిజీ అయ్యారట..? నాకుడ చిన్నప్పటి నుంచి పాటలు పాడటం అంటే ఎంతో ఇష్టం. సింగర్ అవ్వాలని కోరిక ఉండేది. చిన్నప్పుడు పాడటం నేర్చుకుని.. సింగింగ్ కాంపిటిషన్లో పాల్గొనేదాన్ని. ఇటీవల ఓ సినిమాలో పాట పాడా. అది కూడా తెలుగు లోనే. ఏ సినిమా అన్నది ఇప్పుడే చెప్పను.

దిశ వంటి ఘటనలను చూస్తుంటే ఏమనిపిస్తుంది? ఇలాంటి ఘటనలు చూస్తే కోపంతో పాటు.. భయం కూడా కల్గుతుంది. అయితే మార్పుకోసం చట్టాలు మారాలి. అవి మారాలంటే మన పాలకులు దృష్టిసారించాలి. అండ్ అమ్మాయిలకు చెప్పే సూచన ఒక్కటే. మీ జాగ్రత్తలో మీరు ఉంటూ.. పెప్పర్‌ స్ప్రేని అందుబాటులో ఉంచుకోండి.

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో