దేశంలో కోవిద్-19 కరాళనృత్యం చేస్తోంది. ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ క్రమంలో ప్రభుత్వం రిఫర్ చేసిన కరోనా రోగులకు ప్రైవేటు ఆస్పత్రులు రెమ్డిసివిర్‌తో చికిత్స చేయచ్చంటూ కర్ణాటక ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటివరకూ ప్రభుత్వ ఆస్పత్రుల్లోని రోగులకు ఈ సౌలభ్యం అందుబాటులో ఉండగా.. తాజాగా ప్రైవేటు ఆస్పత్రులకూ ఈ వెసులుబాటును ప్రభుత్వం కల్పించింది. అయితే.. ఆస్పత్రి యాజమాన్యాలు ముందుగా.. రెమ్డిసివిర్ కోసం సువర్ణ ఆరోగ్య సురక్ష ట్రస్టుకు దరఖాస్తు చేసుకోవాలని తెలిపింది. ఈ విజ్ఞప్తులను పరిశీలించి తగు అనుమతులు జారీ చేస్తారంటూ ప్రభుత్వం తాజా మార్గదర్శకాలు జారీ చేసింది.
Read More:
తెలంగాణలో అతి భారీ వర్షాలు.. రికార్డు స్థాయిలో 27 సెంటీమీటర్లు..!