వెబ్​సిరీస్​లో కనిపించనున్న స్టార్​ షట్లర్​ పీవీ సింధు

|

Sep 26, 2020 | 8:37 PM

భారత స్టార్​ షట్లర్​ పీవీ సింధు 'ది ఏ గేమ్​' పేరుతో తీయనున్న వెబ్​సిరీస్​లో కనిపించబోతుంది. ఈ విషయాన్ని సింధు స్వయంగా వెల్లడించింది.

వెబ్​సిరీస్​లో కనిపించనున్న స్టార్​ షట్లర్​ పీవీ సింధు
Follow us on

భారత స్టార్​ షట్లర్​ పీవీ సింధు ‘ది ఏ గేమ్​’ పేరుతో తీయనున్న వెబ్​సిరీస్​లో కనిపించబోతుంది. ఈ విషయాన్ని సింధు స్వయంగా వెల్లడించింది. ఆమెతో సహా మరో నలుగురు ప్రముఖ అథ్లెట్లు ఇందులో నటించనున్నారు.  తనను ఎంపిక చేయడంపై సింధు ఆనందం వ్యక్తం చేసింది.

ప్రజలకు తెలియడం కోసం స్టార్​ ప్లేయర్ల జీవితాల్లోని ముఖ్యమైన సంఘటనలు, సందర్భాలను ఈ సిరీస్ ద్వారా చూపించనుంది ప్రముఖ ఛానెల్​. భారత క్రీడా చరిత్రలో ఈ అథ్లెట్లు ఎలాంటి విజయాలు నమోదు చేశారు. కెరీర్​లో ఉన్నత స్థాయికి ఎదగడానికి ఎలాంటి  ఇబ్బందులు ఎదుర్కున్నారు, వాటిని అధిగమించి ఎలా ఉన్నత శిఖరాలకు వెళ్లారు. కష్టాల్లో ఉన్నాప్పుడు వారి  ఆలోచన దృక్పథం ఎలా ఉంటుంది సహా తదితర అంశాల ఆధారంగా ఈ సిరీస్ ​ రూపొందిస్తున్నారు.

అథ్లెట్లు తమ కెరీర్​లోని ముఖ్య సంఘటలను ఇందులో పంచుకుంటారు. ఇప్పటికే ఈ సిరీస్​లో వచ్చిన తొలి రెండు పార్ట్స్ ‘డబుల్​ ట్రబుల్’​, ‘ది ఫినిష్​ లైన్’​ లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. త్వరలో ‘ది ఏ గేమ్’ ​సిరీస్​ రానుంది.

Also Read :

ఈ సారి తిరుమల, తిరుపతి పోలీసులు బుక్కయ్యారు

డెంగ్యూతో కూడా డేంజరే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి !