డెంగ్యూతో కూడా డేంజరే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి !

రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటే మనల్ని అన్ని రకాల వైరస్ లు, జబ్బులు మిమ్మల్ని అటాక్ చేస్తాయి. ప్రస్తుతం కరోనా వైరస్ తో పాటు డెంగ్యూ కూడా ప్రజలపై దాడి చేస్తోంది.

డెంగ్యూతో కూడా డేంజరే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి !
Follow us

|

Updated on: Sep 26, 2020 | 8:21 PM

రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటే మనల్ని అన్ని రకాల వైరస్ లు, జబ్బులు మిమ్మల్ని అటాక్ చేస్తాయి. ప్రస్తుతం కరోనా వైరస్ తో పాటు డెంగ్యూ కూడా ప్రజలపై దాడి చేస్తోంది. రెండీటిలోనూ జ్వరం ప్రధాన లక్షణం కావడం ప్రజల్లో కాస్త అప్రమత్తత అవసరం.  రెండు వ్యాధులు చాలా ప్రమాదకరమైనవి కూడా. కరోనా లక్షణాలు ఎలా ఉంటాయో ప్రజలకు ఇప్పుడు అర్థమయ్యింది. ఇప్పుడు డెంగ్యూ లక్షణాల గురించి తెలుసుకుందాం.  వాంతులు, విరేచనాలు,  బాడీ టెంపరేచర్ పెరగటం, తలనొప్పి,  కంటి నొప్పి, మంటలు, చర్మ సమస్యలు , చిగుళ్ళ నుంచి రక్త స్రావం, జలుబు, దగ్గు, మూత్రం, మలంలో రక్తం, కడుపు నొప్పి, నీరసం వంటివి డెంగ్యూ వచ్చిన  వారిలో ఎక్కువగా కనిపిస్తాయి. అయితే లక్షణాలు అందరికీ ఒకేలా ఉండవు, శరీర స్వభావాన్ని బట్టి మారుతూ ఉండొచ్చు.

డెంగ్యూ జ్వరం దోమల వస్తుంది కాబట్టి, ముందుకు దోమలు ఇంట్లోకి రాకుండా జాగ్రత్త పడాలి. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. చుట్టుపక్కల బురద గుంటలు లేకుండా జాగ్రత్త పడాలి. నిద్రించేటప్పుడు కాళ్లు, చేతులు కప్పి ఉంచేలా జాగ్రత్తలు తీసుకోవాలి. సాయంత్రం, రాత్రి వేళల్లో ఇంట్లోకి దోమలు కాకుండా కిటికీలు, తలుపులు మూసి ఉంచాలి. పాత టైర్లు, కొబ్బరి చిప్పలు, ప్లాస్టిక్ వ్యర్థాలు లేకుండా ఇంటి పరిసరాల్లో చూసుకోవాలి

నోట్ : ఆరోగ్య నిపుణులు చెప్పిన వివరాల ప్రకారం ఈ సమాచారం అందించబడింది.  ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడం మంచింది.

Also Read :

ఈ సారి తిరుమల, తిరుపతి పోలీసులు బుక్కయ్యారు

వివేకా హత్య కేసు అప్డేట్ : ఆర్థిక లావాదేవీల కోణంలో సీబీఐ ఫోకస్