థామస్‌ అండ్‌ ఉబెర్‌ కప్‌ టోర్నీలో సింధు ఆడుతుంది: బాయ్

|

Sep 08, 2020 | 10:21 AM

ప్రపంచ ఛాంపియన్‌ పి.వి.సింధు ఆలోచన మార్చుకుంది. వచ్చే నెలలో జరిగే థామస్‌ అండ్‌ ఉబెర్‌ కప్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీలో ఆడాలని ఆమె నిర్ణయించుకుంది.

థామస్‌ అండ్‌ ఉబెర్‌ కప్‌ టోర్నీలో సింధు ఆడుతుంది: బాయ్
Follow us on

ప్రపంచ ఛాంపియన్‌ పి.వి.సింధు ఆలోచన మార్చుకుంది. వచ్చే నెలలో జరిగే థామస్‌ అండ్‌ ఉబెర్‌ కప్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీలో ఆడాలని ఆమె నిర్ణయించుకుంది. కరోనా కారణంగా అయిదు నెలలుగా ఆటకు దూరంగా ఉన్న సింధు.. వ్యక్తిగత కారణాలతో ఈ టోర్నీకి దూరమవుతున్నట్లు ఇటీవల ఆమె తండ్రి రమణ ప్రకటించారు. అయితే, భారత బ్యాడ్మింటన్‌ సంఘం అధ్యక్షుడు హిమంత శర్మ విజ్ఞప్తి మేరకు ఆమె తన నిర్ణయాన్ని మార్చుకున్నట్లు తెలుస్తోంది. టోర్నీలో డ్రా మనకు అనుకూలంగా ఉన్నందున తిరిగి టోర్నీలో పాల్గొనాలని నిర్ణయించుకుంది. పతకం గెలవడానికి మంచి అవకాశమున్న నేపథ్యంలో ఈ టోర్నీలో ఆడాలని సింధుకు విజ్ఞప్తి చేశానని హేమంత్ శర్మ తెలిపారు. తన కుటుంబంలో జరగాల్సిన ఓ వేడుకను వాయిదా వేసుకుని ఈ టోర్నీలో ఆడేందుకు ఆమె అంగీకరించిందని హిమంత చెప్పారు. అక్టోబరు 3న ఈ టోర్నీ ఆరంభంకానున్న థామస్‌ అండ్‌ ఉబెర్‌ కప్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీలో సింధు ఆడుతుందని హేమంత్ వెల్లడించారు.