అన్నదాతలను అర్బన్ నక్సల్స్ అంటారా ? బీజేపీ నేతపై పంజాబ్ సీఎం అమరేందర్ సింగ్ ఫైర్, ఫూలిష్ అని తీవ్ర వ్యాఖ్య

రైతులను అర్బన్ నక్సల్స్ అని బీజేపీ నేత తరుణ్ చుగ్ ఆరోపించడంపై పంజాబ్ సీఎం అమరేందర్ సింగ్ మండిపడ్డారు. ఆయనను ఫూలిష్ అంటూ దుయ్యబట్టారు..

అన్నదాతలను అర్బన్ నక్సల్స్ అంటారా ? బీజేపీ నేతపై పంజాబ్ సీఎం అమరేందర్ సింగ్ ఫైర్, ఫూలిష్ అని తీవ్ర వ్యాఖ్య

Edited By: Pardhasaradhi Peri

Updated on: Dec 27, 2020 | 7:34 PM

రైతులను అర్బన్ నక్సల్స్ అని బీజేపీ నేత తరుణ్ చుగ్ ఆరోపించడంపై పంజాబ్ సీఎం అమరేందర్ సింగ్ మండిపడ్డారు. ఆయనను ఫూలిష్ అంటూ దుయ్యబట్టారు. పంజాబ్ లో శాంతి భద్రతల పరిస్థితి దిగజారడానికి మీరే కారణమన్నారు. మీ కామెంట్లు మూర్ఖంగా ఉన్నాయని, సంకుచిత ప్రయోజనాలతో రైతులను విమర్శిస్తున్నారని అన్నారు. ఢిల్లీలో తప్పుదారిన నడుస్తున్న మీ రాజకీయాల వల్లే రైతులు నేడు ఇంత దుర్భర పరిస్థితిని ఎదుర్కొంటున్నారని అయన ట్వీట్ చేశారు. పంజాబ్ లో టెలికం సర్వీసులకు 24 గంటలుగా అంతరాయం కలుగుతోందని, ఇందుకు ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ సరిగా లేకపోవడమే కారణమని  తరుణ్ ఛుగ్ ఆరోపించారు. అయితే అమరేందర్ సింగ్ వీటిని తిప్పి కొడుతూ మొదట మీ రాష్ట్రంలోని లా అండ్ పరిస్థితిని చూసుకోవాలని సవాల్ విసిరారు. రైతులు ఇన్ని రోజులుగా ఆందోళన చేస్తున్నా  బీజేపీ ప్రభుత్వం పట్టించుకోక పోగా వారిని అర్బన్ నక్సల్స్ అంటూ ఆరోపించడం మీ మూర్ఖత్వానికి నిదర్శనం అన్నారు.