BJP MLA Passed Away: పుదుచ్చేరి బీజేపీ ఎమ్మెల్యే , ట్రెజరర్ కేజీ శంకర్ మృతి, సంతాపం తెలిపిన రాజకీయ నేతలు

BJP MLA Passed Away:  పుదుచ్చేరి బీజేపీ ఎమ్మెల్యే , ట్రెజరర్ కేజీ శంకర్ మృతి, సంతాపం తెలిపిన రాజకీయ నేతలు

కేంద్ర పాలిత ప్రాతం బీజేపీ ఎమ్మెల్యే , ట్రెజరర్ కేజీ శంకర్ ( 71) మృతి చెందారు. ఇలాంగోనగర్ లోని తన నివాసంలో గుండెపోటుతో ఆదివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఉదయం నిద్రలేవగానే ఛాతీలో నొప్పి రాగా..

Surya Kala

|

Jan 17, 2021 | 6:30 PM

BJP MLA Passed Away: కేంద్ర పాలిత ప్రాతం పుదుచ్చేరి బీజేపీ ఎమ్మెల్యే , ట్రెజరర్ కేజీ శంకర్ ( 71) మృతి చెందారు. ఇలాంగోనగర్ లోని తన నివాసంలో గుండెపోటుతో ఆదివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఉదయం నిద్రలేవగానే ఛాతీలో నొప్పి రాగా.. కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించేందుకు ప్రయత్నిస్తున్న సమయంలోనే ఆయన మరణించారు. శంకర్ కు భార్య, కూతురు, కుమారుడు ఉన్నారు. కేజీ శంకర్ మృతిపట్ల పుదుచ్చేరి సీఎం నారాయణ స్వామి సహా పలువురు రాజకీయ నేతలు, ప్రముఖులు సంతాపం తెలిపారు. 1950లో పుదుచ్చేరిలో జ‌న్మించిన శంక‌ర్‌.. 1984 నుంచి ఇప్పటివ‌ర‌కు బీజేపీ నాయ‌కుడిగా కొన‌సాగారు.

శంకర్ మృతికి పలువురు రాజకీయ నేతలు సంతాపం వ్యక్తం చేశారు. పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ, సీఎం నారాయణ స్వామి, స్పీకర్ శివ కోలంతు మంత్రులు సంతాపం తెలిపారు.

Also Read: డైలీ సీరియల్‌లా సాగుతున్న బాలీవుడ్ డ్రగ్స్ కేసు.. దియా మీర్జా మాజీ మేనేజర్‌కు షాక్ ఇచ్చిన కోర్టు

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu