PM Modi Appointed : ప్రపంచ ప్రఖ్యాత సోమ్‌నాథ్ ఆలయ ట్రస్ట్ కొత్త ఛైర్మన్‌గా ప్రధాని నరేంద్ర మోదీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గుజరాత్‌లోని సోమనాథ్ దేవాలయ ట్రస్ట్ ఛైర్మన్‌గా ప్రధాని మోదీ నియమితులయ్యారు. గిర్ సోమనాథ్ జిల్లాలోని ప్రభాస్ పటాన్ పట్టణంలో ఉన్న ఈ ప్రముఖ ఆలయ ట్రస్ట్‌కు ఇప్పటికే ట్రస్టీగా కొనసాగుతున్న మోదీని.. ఛైర్మన్‌గా ఎన్నుకున్నట్టు సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.
గత కొన్నేళ్ల పాటు ట్రస్టు ఛైర్మన్‌గా పనిచేసిన గుజరాత్ మాజీ సీఎం కేశూభాయ్ పటేల్ అక్టోబర్‌లో మరణించడంతో అప్పట్నుంచి ఈ స్థానం ఖాళీగా ఉంది. దీంతో ఆలయ ట్రస్టు 120వ సమావేశంను సోమవారం వర్చువల్ పద్ధతిలో నిర్వహించారు. ఇందులో పాల్గొన్న ట్రస్ట్ సభ్యులు కొత్త ఛైర్మన్‌గా ప్రధాని మోదీని నియమించాలని ఏకగ్రీవంగా నిర్ణయించినట్టు ట్రస్టీ సెక్రటరీ పీకే లెహ్రీ వెల్లడించారు. ఈ ట్రస్టులో ఇతర ట్రస్టీలుగా బీజేపీ నేత ఎల్‌కే అద్వాని, కేంద్ర హోంమంత్రి అమిత్ షా తదితరులు ఉన్నారు.
Prime Minister Narendra Modi becomes the president of Somnath Temple Trust, tweets Union Home Minister Amit Shah
(Photo credit – Twitter account of the home minister) pic.twitter.com/0Eos8vgIPM
— ANI (@ANI) January 18, 2021