దిగివస్తున్న బంగారం ధర.. ‘మరింత తగ్గొచ్చు…’

|

Sep 22, 2020 | 9:28 PM

ఎంసీఎక్స్(MCX) ‌లో మంగళవారం పదిగ్రాముల బంగారం 100 రూపాయలు దిగివచ్చి 50,373 రూపాయలకు తగ్గింది. ఇక కిలో వెండి 706 రూపాయలు పతనమై 60,610 రూపాయలు పలికింది...

దిగివస్తున్న బంగారం ధర.. మరింత తగ్గొచ్చు...
Follow us on

పై పైకి ఎగిసిన బంగారం ధరలు నెమ్మదిగా దిగివస్తున్నాయి. సామాన్యుడికి అందుబాటులోకి వస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు తగ్గడంతో దేశీ మార్కెట్‌లోనూ పసిడి దిగివచ్చింది. ఎంసీఎక్స్(MCX) ‌లో మంగళవారం పదిగ్రాముల బంగారం 100 రూపాయలు దిగివచ్చి 50,373 రూపాయలకు తగ్గింది. ఇక కిలో వెండి 706 రూపాయలు పతనమై 60,610 రూపాయలు పలికింది. సోమవారం మాత్రం బంగారం ధర భారీగా తగ్గింది.

డాలర్‌ బలోపేతంతో బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయని బులియన్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో స్పాట్‌గోల్డ్‌ ఔన్స్‌ 1900 డాలర్లకు తగ్గింది. యూరప్‌, బ్రిటన్‌లో కోవిడ్-19 వైరస్‌ కేసులు రెండోసారి భారీగా నమోదవుతుండటంతో ఇన్వెస్టర్లు సురక్షిత పెట్టుబడి సాధనంగా కరెన్సీ (డాలర్‌)ను ఎంచుకోవడంతో పసిడికి డిమాండ్‌ తగ్గింది.