వైసీపీ నాయకురాలు ఆత్మహత్యాయత్నం

టంగుటూరులో వైసీపీ నాయకురాలు బొడ్డపాటి అరుణ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. టంగుటూరు మండల వైసీపీ సమీక్షా సమావేశానికిఅనుమతించలేదని మనస్తాపంతో నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం.

వైసీపీ నాయకురాలు ఆత్మహత్యాయత్నం

Updated on: Jun 22, 2020 | 6:37 PM

ప్రకాశం జిల్లాలో అధికారపార్టీ నేతల మధ్య విభేదాలు మరోసారి బయటపడ్డాయి. టంగుటూరులో వైసీపీ నాయకురాలు బొడ్డపాటి అరుణ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. సోమవారం టంగుటూరు మండల వైసీపీ సమీక్షా సమావేశానికి వెళ్లిన అరుణను రావూరి అయ్యవారయ్య వర్గీయులు అడ్డుకున్నారు. దీంతో తీవ్ర మనస్థాపంతో ఇంటికి చేరుకుని నిద్ర మాత్రలు మింగి ఆత్మాహత్యాయత్నానికి పాల్పడింది. ఇది గమనించిన కుటుంబసభ్యులు ఆమె హుటాహుటిన ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం వైసీపీ‌కి ప్రచార కమిటీ కన్వీనర్‌గా కూడా అరుణ కొనసాగుతున్నారు. మండలంలోని నేతలందరినీ అనుమతించి ఆమెను నిరాకరించడంతో తీవ్ర బావోద్రేకానికి లోనట్లు కుటుంబసభ్యుులు తెలిపారు. ఇందుకు సంబంధించి స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Loading...
Unable to load recommendations.
Follow Us