
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ విజృంభణ ఏమాత్రం తగ్గడం లేదు. రోజు రోజుకీ అంతకంతకు కొత్త కేసులు వెలుగు చూస్తూనే ఉన్నాయి. కరోనా వైరస్ నేపథ్యంలో గత కొన్ని నెలలుగా స్కూళ్లు, కాలేజీలు మూతపడ్డాయి. తాజాగా నవంబర్ 2 నుంచి పాఠశాలలు తిరిగి తెరుచుకున్నాయి. ఇందులో భాగంగా ప్రకాశం జిల్లాలోని ఓ పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రలను భయాందోళనకు గురిచేస్తోంది. జిల్లాలోని హనుమంతునిపాడు మండలం గొల్లపల్లి స్కూల్‌లో ఓ ఉపాధ్యాయునికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో అప్రమత్తమైన అధికారులు స్కూల్‌లోని విద్యార్థులకు, ఉపాధ్యాయులకు అధికారులు హుటాహుటిన కరోనా టెస్టులు చేయిస్తున్నారు. ఉపాధ్యాయునికి కరోనా పాజిటివ్ అని తేలడంతో ఇతర విద్యార్థులు, ఉపాధ్యాయులు భయాందోళనకు గురవుతున్నారు. దీంతో అధికారులు పాఠశాలకు మరోసారి సెలవు ప్రకటించారు.