Positive Response For Vijaya Raghavan: ‘బిచ్చగాడు’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యాడు తమిళ స్టార్ హీరో విజయ్ ఆంటోనీ. ఇందులో విజయ్ తన సహజ నటనతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. దీంతో ఆ తర్వాత తమిళ్‌లో వచ్చిన విజయ్ సినిమాలన్నీ తెలుగులోనూ విడుదల చేయడం ప్రారంభమైంది. విజయ్‌కి తెలుగులోనూ మార్కెట్ పెరగడమే దీనికి కారణం.
ఇదిలా ఉంటే విజయ్ హీరోగా తెరకెక్కుతోన్న తాజా చిత్రం ‘విజయ రాఘవన్’ కూడా తెలుగులో విడుదల కానుంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను యూనిట్ విడుదల చేసింది. ప్రస్తుతం ఈ టీజర్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఈ సినిమాలో విజయ్ ట్యూషన్ మాస్టర్ పాత్రలో కనిపించనున్నాడు. టీజర్ విడుదలైన కొన్ని గంటల్లోనే లక్షల వ్యూలతో దూసుకెళుతోంది. ఇందులో ‘గాజు ముక్క కూడా వేస్టే.. కానీ కంట్లో పడితే రక్తంగా మారుతుంది’ అంటూ విజయ్ చెప్పే డైలగ్ ఆకట్టుకుంటోంది. ఆనంద్ కృష్ణన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఆత్మిక, రామచంద్రరాజు, ప్రభాకర్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఐదు భాషల్లో విడుదల చేయనున్న ఈ సినిమాను వేసవి కానుకగా తీసుకురావడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది.
Also Read: MS Dhoni and Ziva : కూతురుతో కలిసి కనిపించబోతున్న మిస్టర్ కూల్, టీమిండియా మాజీ కెప్టెన్…