Pollution Effect: పర్యావరణ వ్యవస్థ అనగా భౌతిక వ్యవస్థలు, జీవ క్రియలకు అస్థిరత, అసమానత, హాని, అసౌకర్యం కలిగించే విధంగా కలుషితాలని పర్యావరణంలోకి విడుదల చెయ్యటాన్ని కాలుష్యం అంటారు. దేశమంతా వాయు కాలుష్యం, నేల కాలుష్యం, నీటి కాలుష్యం, ధ్వని కాలుష్యాలతో నిండిపోవడం వల్ల ప్రజలు ఎన్నో జబ్బులకు గురౌతున్నారు. అయితే కాలుష్యం వల్ల ప్రజల ఆరోగ్యాలు పాడవుతున్నాయని అందరికి తెలిసిన విషయమే కానీ.. మహారాష్ట్రాలోని థానేలో పొల్యూషన్ వల్ల రోడ్లన్నీ పింక్ కలర్ లోకి మారిపోతున్నాయి. ఇక్కడ అగ్రో కెమికల్, పెస్టిసైడ్, ఇతర కెమికల్ ఇండస్ట్రీలు చాలానే ఉన్నాయట.
గతంలో ఓసారి కెమికల్స్ కలవడం వల్ల వానచినుకులు సైతం గ్రీన్ కలర్ లో పడ్డాయట. ఈ కెమికల్ ఇండస్ట్రీల వల్ల ఎన్నో ఏళ్లుగా విడుదలవుతున్న వాయువులు, పౌడర్లు, కెమికల్స్ తో ఈ ఏరియా అంతా కంపు కొడుతోందట. తాజాగా ఇండస్ట్రీల నుంచి కెమికల్ పౌడర్ ఇలా రోడ్ల మీద పడుతుండటంతో.. రోడ్లన్నీ గులాబీ రంగులోకి మారాయి. దీంతో జనాలంతా మహారాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు విన్నవించుకున్నారు.
థానే పొల్యూషన్ విషయం మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రే వరకూ వెళ్లింది. దీంతో ఈ అంశంపై వెంటనే నివేదిక ఇవ్వాలంటూ ఆయన బుధవారం పొల్యూషన్ కంట్రోల్ బోర్డును ఆదేశించారు. దీంతో వెంటనే అధికారులు వచ్చి ఈ ప్రాంతాన్ని పరిశీలించి, రోడ్లపై మట్టి శాంపిల్స్ సేకరించారు. అంతేకాదు పరిస్థితులు ప్రమాదకరంగా మారడంతో కాలుష్యం తగ్గించేందుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది.