loan apps case : పోలీస్ అంటే ఈయనే..కన్న కొడుకునే పట్టించాడు..సెల్యూట్ చేస్తోన్న నెటిజన్లు

ప్రస్తుతం లోన్ యాప్స్ వ్యవహారం ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతోంది. ఈ యాప్స్ నుంచి రుణాలు తీసుకుని..అధిక వడ్డీలు కట్టలేక..సంస్థల ఒత్తిడి భరించలేక పలువురు బలవన్మరణాలకు పాల్పడ్డారు.

loan apps case : పోలీస్ అంటే ఈయనే..కన్న కొడుకునే పట్టించాడు..సెల్యూట్ చేస్తోన్న నెటిజన్లు

Updated on: Jan 01, 2021 | 4:32 PM

loan apps case: ప్రస్తుతం లోన్ యాప్స్ వ్యవహారం ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతోంది. ఈ యాప్స్ నుంచి రుణాలు తీసుకుని..అధిక వడ్డీలు కట్టలేక..సంస్థల ఒత్తిడి భరించలేక పలువురు బలవన్మరణాలకు పాల్పడ్డారు. ఫిర్యాదులు అందిన అనంతరం యాప్ నిర్వాహకులపై ఫోకస్ పెట్టిన పోలీసులు..ఇప్పటికే పలువురిని అదుపులోకి తీసుకున్నారు. లోన్ యాప్స్ ద్వారా చైనా యాప్‌లు ఆర్నెళ్ల వ్యవధిలో రూ. 21 వేల కోట్లు కొల్లగొట్టినట్లు పోలీసులు గుర్తించారు.

ఈ లోన్ యాప్ కంపెనీలకు సంబంధించిన ఆర్థిక వ్యవహారాలను కర్నూలుకు చెందిన నాగరాజు అనే వ్యక్తి పర్యవేక్షిస్తున్నాడు. అయితే కేసులు నమోదైన విషయం తెలిసిన వద్ద నుంచి అతడు పత్తా లేకుండా పోయాడు. అదే కంపెనీలో పనిచేస్తోన్న నాగరాజు సోదరుడు ఈశ్వర్ కుమార్‌ను ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న నాగరాజును తాజాగా ఏఎస్ఐగా పనిచేస్తోన్న అతని తండ్రే పోలీసులకు పట్టించాడు.  తప్పించుకొని తిరుగుతున్న రెండవ కొడుకు నాగరాజును తానే రప్పించి హైదరాబాద్‌లో పోలీసులకు అప్పగించారు ఆ పోలీస్ తండ్రి. ఆయన తన పేరు, వివరాలు బహిర్గతం చేయొద్దని సైబర్ క్రైమ్ పోలీసులను కోరాడు.  తాను పోలీస్ కావడంతో నిందితుడు అయిన కొడుకును పోలీసులకు అప్పగించానని చెప్పారు. ఇద్దరు కొడుకులు ఇలా కావడం చాలా బాధగా ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

Also Read : 

Coronavirus Alert : సూర్యాపేటలో కరోనా కన్నెర్ర..ఒక కుటుంబంలో ఏకంగా 22 మందికి వైరస్ పాజిటివ్

Nara Lokesh Challenge : సీఎం జగన్‌కు నారా లోకేశ్ సవాల్..’సింహాద్రి అప్పన్న’ సాక్షిగా తేల్చుకుందాం అంటూ ట్వీట్