ప్రధానమంత్రి నరేంద్రమోదీ మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా నేడు దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడనున్నారు. ఈరోజు ఉదయం 11 గంటలకు మన్ కీ బాత్ 71వ ఎడిషన్‌లో తన మనసులోని విషయాలను ప్రజలతో పంచుకోనున్నారు. దేశీయంగా అభివృద్ధి చేస్తున్న కొవిడ్ టీకాల పనితీరు, పురోగతిని పరిశీలించేందుకు శనివారం అహ్మదాబాద్, పుణె, హైదరాబాద్‌లోని ఫార్మా సంస్థలను సందర్శించారు మోదీ. శాస్త్రవేత్తలతో మాట్లాడి వాటి అభివృద్ది సహా ఇతర వివరాలు తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలో నేటి మనసులో మాట కార్యక్రమంలో వ్యాక్సిన్‌పై కీలక ప్రకటన చేసే అవకాశాలు ఉన్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.
Do tune in tomorrow! #MannKiBaat pic.twitter.com/LVau1GQjKb
— Narendra Modi (@narendramodi) November 28, 2020