దేశ రాజధానిలో ఢిల్లీలో చైన్ స్నాచర్లు రెచ్చిపోయారు. ప్రధాని సోదరుడు ప్రహ్లాద్‌మోదీ కుమార్తె దమయంతి బెన్ మోదీ హ్యాండ్‌బ్యాగునే దుండగులు గుంజుకొని వెళ్లారు. ఈ మేరకు ఢిల్లీలోని సివిల్ లైన్స్ ఏరియా పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. ఆ బ్యాగులో రూ.56 వేల నగదు, రెండు మొబైల్ ఫోన్‌లు, కొన్ని కీలక పత్రాలు ఉన్నట్లు ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. శనివారం ఉదయం అమృతసర్ నుంచి ఢిల్లీ వచ్చిన దమయంతి బెన్ సివిల్ లైన్స్‌లోని గుజరాత్ సమాజ్ భవన్‌లో గది బుక్ చేసుకున్నారు. భవన్ గేటు వద్ద దిగి లోపలికి వెళ్లే లోపునే బైక్‌పై వచ్చిన ఇద్దరు ఆగంతుకులు ఆమె చేతిలో ఉన్న బ్యాగును లాక్కుని పారిపోయారు.
దీనిపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఇంటికి సమీపంలోనే ఈ చోరీ జరిగింది. దమయంతి బెన్ మోడీ శనివారం ఉదయం అమృత్‌సర్ నుంచి ఢిల్లీకి వచ్చారు. గుజరాతీ సమాజ్ భవన్‌లో ఒక గది కూడా బుక్ చేసుకున్నారు. షెడ్యూల్ ప్రకారం సాయంత్రం ఢిల్లీ నుంచి అహ్మదాబాద్‌కు వెళ్లాల్సి ఉంది. ఇంతలో షాకింగ్ ఘటన జరిగింది. స్నాచింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.