నేడు మాల్దీవులకు ప్రధాని మోదీ

| Edited By:

Jun 08, 2019 | 7:32 AM

రెండో సారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నరేంద్ర మోదీ విదేశీ పర్యటనలు ఇవాళ్టి నుంచి ప్రారంభంకానున్నాయి. నేడు మాల్దీవుల పర్యటనకు వెళ్లనున్నారు. అనంతరం ఆదివారం శ్రీలంకలోనూ పర్యటిస్తారు. ప్రధానిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత మోదీ చేస్తున్న తొలి విదేశీ పర్యటన ఇదే. పర్యటనను ఉద్దేశించి ట్వీట్ కూడా చేశారు. పొరుగుదేశాలకు భారత్​ అత్యంత ప్రాధాన్యమిస్తుందని పేర్కొన్నారు. తనను మాల్దీవులకు ఆహ్వానించినందుకు ఆ దేశాధ్యక్షునికి మోదీ కృతజ్ఞతలు తెలిపారు. పొరుగు తీర దేశాలతో భారత్​ సత్సంబంధాలు మరింత […]

నేడు మాల్దీవులకు ప్రధాని మోదీ
Follow us on

రెండో సారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నరేంద్ర మోదీ విదేశీ పర్యటనలు ఇవాళ్టి నుంచి ప్రారంభంకానున్నాయి. నేడు మాల్దీవుల పర్యటనకు వెళ్లనున్నారు. అనంతరం ఆదివారం శ్రీలంకలోనూ పర్యటిస్తారు. ప్రధానిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత మోదీ చేస్తున్న తొలి విదేశీ పర్యటన ఇదే. పర్యటనను ఉద్దేశించి ట్వీట్ కూడా చేశారు. పొరుగుదేశాలకు భారత్​ అత్యంత ప్రాధాన్యమిస్తుందని పేర్కొన్నారు. తనను మాల్దీవులకు ఆహ్వానించినందుకు ఆ దేశాధ్యక్షునికి మోదీ కృతజ్ఞతలు తెలిపారు.

పొరుగు తీర దేశాలతో భారత్​ సత్సంబంధాలు మరింత బలోపేతమయ్యే దిశగా అడుగులు వేస్తామని అన్నారు. పొరుగు దేశమై శ్రీలంకలో జరిగిన బాంబు దాడుల బాధితులకు భారత ప్రజలు అండగా ఉంటారని మోదీ స్పష్టం చేశారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడేందుకు శ్రీలంకకు అన్ని విధాల సాయమందిస్తామని వెల్లడించారు.

కాగా, మోదీని ప్రఖ్యాత ‘నిషానిజుద్దీన్​’ అవార్డుతో మాల్దీవుల అధ్యక్షుడు సత్కరించనున్నారు. అలాగే మాల్దీవుల పార్లమెంట్​లో మోదీ ప్రసంగించనున్నారు. 2014 నుంచి ఇప్పటి వరకు మొత్తం 9 దేశాల పార్లమెంట్​ల్లో ఆయన ప్రసంగించారు. భూటాన్​, ఆస్ట్రేలియా, ఫిజి, మారిషెస్​, శ్రీలంక, మంగోలియా, అఫ్గానిస్థాన్, అమెరికా, యుగాండ​ పార్లమెంట్​లు ఈ జాబితాలో ఉండగా.. తాజాగా మాల్దీవులు ఈ జాబితాలో చేరనుంది.