సరిహద్దుల్లో మనల్ని ఎవరైనా ఎదుర్కొంటే అందుకు దీటైన గట్టి జవాబిస్తామని ప్రధాని మోదీ అన్నారు. శనివారం జైసల్మీర్ లో సైనికులను ఉద్దేశించి ప్రసంగించిన ఆయన.. విస్తరణవాద శక్తుల కారణంగా మొత్తం ప్రపంచం సమస్యలను ఎదుర్కొంటోందని అన్నారు. ఈ వాద మన్నది 18 వ శతాబ్దం నాటిదని పరోక్షంగా చైనాను ఉద్దేశించి వ్యాఖ్యానించారు .విస్తరణ వాదం వక్రీకరించిన మైండ్ సెట్ ని ప్రతిబింబిస్తుంది అన్నారు. ఉత్తర కాశ్మీర్ లో పలు చోట్ల నిన్న పాకిస్తాన్ కాల్పుల విరమణను ఉల్లంఘించి జరిపిన కాల్పుల్లో 5 గురు సైనికులతో సహా 11 మంది మరణించిన నేపథ్యంలో.. మోదీ వీరి కి ఘనంగా నివాళులర్పించారు. పాకిస్తాన్ ను కూడా ఆయన హెచ్ఛరిస్తూ..ఇతరులను అర్థం చేసుకోవడం, వారు కూడా అర్థం చేసుకునేలా చూడడం ఇండియా పాలసీ అని, దీన్ని ఎవరైనా పరీక్షించాలనుకుంటే సహించబోమని అన్నారు.
ప్రతి ఏడాదీ తను దీపావళిని సైనికులతో జరుపుకుంటానని, మీరంతా తన కుటుంబ సభ్యులవంటి వారని మోదీ అన్నారు. ఈ దేశ ప్రజల తరఫున మీకు కృతజ్ఞతలు తెలుపుతున్నా అన్నారు. ‘నేను నాతో బాటు మీకు స్వీట్స్ తెచ్చాను..కానీ ఇవి కేవలం నేను తెచ్చినవి కావు.. 130 కోట్లమంది భారతీయులు ఇచ్చినవి’ అని ఆయన వ్యాఖ్యానించారు. మీతో ఎంత ఎక్కువసేపు గడిపితే అంత ఎక్కువగా ఈ దేశాన్ని రక్షించగలుగుతానన్న నిశ్చయం నాలో పరిపుష్టమవుతుంది అని ప్రధాని పేర్కొన్నారు.
#WATCH | Rajasthan: PM Narendra Modi took a ride on a tank in Longewala, Jaisalmer, earlier today.
He was in Longewala to celebrate #Diwali with security forces. pic.twitter.com/n77KRdIZfQ
— ANI (@ANI) November 14, 2020