తెలుగు తెరపై తిరుగులేని అందాల తారగా శ్రీదేవికి పేరు ఉంది. ఇప్పటికీ ఎంతోమంది అబ్బాయిలు శ్రీదేవి లాంటి సౌందర్యవతి తమకు భార్యగా రావాలని కలలు కంటారు. ఎవరైనా అందం గురించి అతిగా మాట్లాడుతుంటే ‘అబ్బా..నువ్వు శ్రీదేవిగా ఫీల్ అవ్వకు’ అని అనేస్తారు. అది ఆమె స్థాయి..స్థానం. అయితే ఎక్కువగా చీరకట్టులో కనిపించే అతిలోక సుందరి..తన హుందాతనాన్ని కూడా చాటుకునేవారు. 1980- 90ల్లో చాలామంది మహిళలు ఆమె చీరకట్టును అనుసరించేవారు.
తాజాగా శ్రీదేవి గారాల పట్టి జాన్వీకపూర్ చీరలో అచ్చం తల్లిని తలపిస్తున్నారు. తండ్రి బోనీకపూర్, సోదరి ఖుషీకపూర్‌తో కలసి ముంబైలోని తమ నివాసంలో దీపావళి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు జాన్వీ. ఆ ఫొటోలను ఆమె సామాజిక మాద్యమాల్లో పంచుకోగా అవి వైరలయ్యాయి. ‘పసుపుపచ్చరంగు చీరలో అందంగా కనిపించడమే కాకుండా రూపంలో తల్లి శ్రీదేవిని తలపించారని పలువురు కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం జాన్వీ ‘రూహీ అఫ్జానా’, ‘దోస్తానా 2’ సినిమాల్లో నటిస్తున్నారు.
Also Read :
వారెవ్వా.. అతడికి అదృష్టం ఆకాశం నుంచి ఊడిపడింది..ఒక్క రోజులో కోటీశ్వరుడు
పెంపుడు శునకంపై మితిమీరిన ప్రేమ..యువతి ఆత్మహత్య..అక్కడే పూడ్చిపెట్టాలంటూ..