‘ ప్చ్.. ఇన్ని రోజుల తరువాతా ‘? తండ్రికి బెయిలుపై కార్తీ చిదంబరం..

' ప్చ్.. ఇన్ని రోజుల తరువాతా '?  తండ్రికి బెయిలుపై కార్తీ చిదంబరం..

ఢిల్లీలోని తీహార్ జైల్లో తన తండ్రి వందరోజులు పైగా గడిపిన తరువాత సుప్రీంకోర్టు ఆయనకు బెయిలు మంజూరు చేయడంపై ఆయన కుమారుడు కార్తీ చిదంబరం స్పందించారు. ‘ చివరకు.. 106 రోజుల తరువాతా ‘.. ప్చ్ ‘..అని ఆయన ట్వీట్ చేశారు. ఐ ఎన్ ఎక్స్ మీడియా కేసులో చిదంబరానికి అత్యున్నత న్యాయస్థానం రూ. రెండు లక్షల పూచీకత్తుపై బెయిలు మంజూరు చేసిన సంగతి విదితమే. ఈ కేసులో ఆయనకు బెయిలు ఇస్తే సాక్షులను ప్రభావితం చేయగలరన్న […]

Anil kumar poka

|

Dec 04, 2019 | 1:02 PM

ఢిల్లీలోని తీహార్ జైల్లో తన తండ్రి వందరోజులు పైగా గడిపిన తరువాత సుప్రీంకోర్టు ఆయనకు బెయిలు మంజూరు చేయడంపై ఆయన కుమారుడు కార్తీ చిదంబరం స్పందించారు. ‘ చివరకు.. 106 రోజుల తరువాతా ‘.. ప్చ్ ‘..అని ఆయన ట్వీట్ చేశారు. ఐ ఎన్ ఎక్స్ మీడియా కేసులో చిదంబరానికి అత్యున్నత న్యాయస్థానం రూ. రెండు లక్షల పూచీకత్తుపై బెయిలు మంజూరు చేసిన సంగతి విదితమే. ఈ కేసులో ఆయనకు బెయిలు ఇస్తే సాక్షులను ప్రభావితం చేయగలరన్న ఈడీ వాదనతో కోర్టు విభేదించింది. జస్టిస్ ఆర్. భానుమతి ఆధ్వర్యాన గల బెంచ్ బుధవారం.. చిదంబరానికి జైలు నుంచి విముక్తి కల్పించింది. కాగా- చివరకు సత్యమే జయించింది అని కాంగ్రెస్ పార్టీ వ్యాఖ్యానించింది.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu