ఎన్నికలు ముగియగానే పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

|

May 20, 2019 | 12:32 PM

లోక్‌సభ ఎన్నికలు ముగిసిన మరుసటి రోజే పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. దేశవ్యాప్తంగా పెట్రోల్ ధరలు 8-10 పైసల మేర పెరగ్గా.. డీజిల్ ధరలు 15-16పైసల మేర పెరిగాయి. ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ డేటా ప్రకారం ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.71.12 కాగా డీజిల్ ధర రూ.66.11గా ఉంది.అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగినందువల్లే దేశీ మార్కెట్‌లోనూ ఇంధన ధరలు పెరిగాయని చెబుతున్నారు. చమురు ఉత్పత్తి దేశాలు పరిమిత క్రూడ్ […]

ఎన్నికలు ముగియగానే పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
Follow us on

లోక్‌సభ ఎన్నికలు ముగిసిన మరుసటి రోజే పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. దేశవ్యాప్తంగా పెట్రోల్ ధరలు 8-10 పైసల మేర పెరగ్గా.. డీజిల్ ధరలు 15-16పైసల మేర పెరిగాయి. ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ డేటా ప్రకారం ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.71.12 కాగా డీజిల్ ధర రూ.66.11గా ఉంది.అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగినందువల్లే దేశీ మార్కెట్‌లోనూ ఇంధన ధరలు పెరిగాయని చెబుతున్నారు.

చమురు ఉత్పత్తి దేశాలు పరిమిత క్రూడ్ ఆయిల్ సరఫరాకి ఒప్పుకున్నట్టు సౌదీ మంత్రి ఖలీద్ అల్ ఫలీహ్ ప్రకటించిన అనంతరం ధరలు 1% మేర పెరిగాయి. ప్రస్తుతం ముంబైలో లీటరు పెట్రోల్ ధర రూ.76.73, డీజిల్ ధర రూ.69.27గా ఉంది. కోల్‌కతా, చెన్నైలలో లీటరు పెట్రోల్ ధర రూ.73.19 నుంచి ధర రూ.73.82కి ఎగబాకింది. డీజిల్ ధర రూ.67.86 నుంచి రూ.69.88కి పెరిగింది.