ఇంధనం ధరలు పైపైకి…

| Edited By:

May 28, 2019 | 6:26 PM

నూతన ప్రభుత్వం ఇంకా అధికారం స్వీకరించకముందే ఇంధనం ధరలు పెరుగుతున్నాయి. గత ఆరు రోజులుగా ఇంధనం ధరలు వరుసగా పెరుగుతూ వస్తున్నాయి. తాజాగా పెట్రోలుపై 0.50 పైసలు పెరుగగా రూ.1.04 పైసలు డీజిల్‌పై పెరిగింది. గత నెలలో మాత్రం పెట్రోలు ధరలు పెద్దగా పెరగలేదు. అంతర్జాతీయంగా చమురు ధరలు పెరిగినప్పటికీ భారత్‌లో మాత్రం పెట్రోలు ధరలు పెరగలేదు. గత నెలలో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ప్రతికూల ఫలితాలు వచ్చే అవకాశమున్నందున పెట్రోలు ధరల పెంచకుండా ప్రభుత్వం నిర్ణయం […]

ఇంధనం ధరలు పైపైకి...
Follow us on

నూతన ప్రభుత్వం ఇంకా అధికారం స్వీకరించకముందే ఇంధనం ధరలు పెరుగుతున్నాయి. గత ఆరు రోజులుగా ఇంధనం ధరలు వరుసగా పెరుగుతూ వస్తున్నాయి. తాజాగా పెట్రోలుపై 0.50 పైసలు పెరుగగా రూ.1.04 పైసలు డీజిల్‌పై పెరిగింది. గత నెలలో మాత్రం పెట్రోలు ధరలు పెద్దగా పెరగలేదు. అంతర్జాతీయంగా చమురు ధరలు పెరిగినప్పటికీ భారత్‌లో మాత్రం పెట్రోలు ధరలు పెరగలేదు. గత నెలలో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ప్రతికూల ఫలితాలు వచ్చే అవకాశమున్నందున పెట్రోలు ధరల పెంచకుండా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మే 19 తర్వాత అంటే ఎన్నికలు ముగిసిన తర్వాత క్రమంగా పెట్రోలు ధరలు పెరుగుతూ వచ్చాయి.

ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ ఇచ్చిన సమాచారం ప్రకారం పెట్రో ధరలు ఢిల్లీ, కోల్‌కతా, ముంబై, చెన్నై నగరాల్లో వరుసగా రూ. 71.86, రూ.73.92, రూ.77.47 రూ.74.59గా ఉన్నాయి. అదే డీజిల్ ధరలు వరుసగా రూ. 66.69, రూ.68.45, రూ. 69.88, రూ.70.50గా ఉన్నాయి. అయితే ఎన్నికల సందర్భంగా పెట్రోలు డీజిల్ ధరలను నియంత్రణలో ఉండేలా చూడాలని ఆయిల్ సంస్థలకు ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీచేసినట్లు సమాచారం. అయితే ఇంధనం ధరల్లో వరుస పెరుగుదలకు కారణం గత 15 రోజులుగా అంతర్జాతీయ మార్కెట్లో ఇంధనం ధరలు పెరుగుతున్నప్పటికీ భారత్‌లో మాత్రం ధరలు పెరగలేదని ఆయిల్ సంస్థలు చెబుతున్నాయి.