కాశ్మీర్‌లో కాల్పులు… పీడీపీ నేతపై ఉగ్రదాడి… సెక్యూరిటీ ఆఫీసర్‌ను బలితీసుకున్న ముష్కరులు….

| Edited By:

Dec 14, 2020 | 1:41 PM

ఉగ్రవాదులు కాశ్మీర్ కు చెందిన పీడీపీ నేతను టార్గెట్ చేశారు. సోమవారం రోజున దాడికి తెగబడ్డారు. తుపాకి తూటాలను పేల్చారు.

కాశ్మీర్‌లో కాల్పులు... పీడీపీ నేతపై ఉగ్రదాడి... సెక్యూరిటీ ఆఫీసర్‌ను బలితీసుకున్న ముష్కరులు....
Follow us on

జమ్మూ – కాశ్మీర్‌ లోయలో నిత్యం తుపాకి తూటాలు పేలుతుంటాయి. ఉగ్రమూకలు సైనికులే లక్ష్యంగా దాడులకు తెగబడుతారు. సామాన్యులను బలి తీసుకుంటారు. ఇటువంటి ఘటనే కాశ్మీర్ జోన్ పరిధిలో చోటు చేసుకుంది.

పీడీపీ నేత టార్గెట్….

ఉగ్రవాదులు కాశ్మీర్ కు చెందిన పీడీపీ నేతను టార్గెట్ చేశారు. సోమవారం రోజున దాడికి తెగబడ్డారు. తుపాకి తూటాలను పేల్చారు. అయితే పీడీపీ నేతకు గార్డ్ గా ఉన్న మంజూర్ మహ్మద్ అనే పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్ ఉగ్రదాడిలో మ‌ృతి చెందాడు. కాగా ఉగ్రదాడిలో గాయపడిన పీడీపీ నేతను శ్రీనగర్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పోలీసులు ఉగ్రదాడికి పాల్పడిన ముష్కరుల కోసం వెతుకుతున్నారు.