సాల్వెంట్ ఫ్యాక్టరీ ప్రమాదంపై పవన్ కళ్యాణ్ ఏమన్నారంటే..

రాంకీ సాల్వెంట్‌ ఫాక్టరీలో జరిగిన ప్రమాదం దురదృష్టకరమన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఈ ప్రమాదంలో మృతిచెందిన వ్యక్తి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మల్లేష్ కు మెరుగైన వైద్య సహాయం అందించాలని  అధికారులను కోరారు. సహాయ కార్యక్రమాల్లో జనసేనికులు పాల్గొనాలని జనసేనాని పిలుపునిచ్చారు. మృతుని కుటుంబానికి, గాయపడినవారికి సంతృప్తికరమైన రీతిలో పరిహారం ఇవ్వాలి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ ప్రమాద ఘటనపై ప్రభుత్వం క్షుణ్ణంగా విచారణ జరపాలన్నారు. ఇటువంటి […]

సాల్వెంట్ ఫ్యాక్టరీ ప్రమాదంపై పవన్ కళ్యాణ్ ఏమన్నారంటే..

Updated on: Jul 14, 2020 | 12:45 PM

రాంకీ సాల్వెంట్‌ ఫాక్టరీలో జరిగిన ప్రమాదం దురదృష్టకరమన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఈ ప్రమాదంలో మృతిచెందిన వ్యక్తి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మల్లేష్ కు మెరుగైన వైద్య సహాయం అందించాలని  అధికారులను కోరారు. సహాయ కార్యక్రమాల్లో జనసేనికులు పాల్గొనాలని జనసేనాని పిలుపునిచ్చారు.

మృతుని కుటుంబానికి, గాయపడినవారికి సంతృప్తికరమైన రీతిలో పరిహారం ఇవ్వాలి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ ప్రమాద ఘటనపై ప్రభుత్వం క్షుణ్ణంగా విచారణ జరపాలన్నారు. ఇటువంటి ప్రమాదాలు చోటుచేసుకోకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలి అని స్థానిక అధికారులకు సూచించారు.