Pawan kalyan new look : పంచకట్టులో పవర్ స్టార్ పవన్.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోలు

|

Jan 13, 2021 | 7:27 PM

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ త్వరలో వకీల్ సాబ్ గా థియేటర్స్ లో సందడి చేయబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యింది.

Pawan kalyan new look : పంచకట్టులో పవర్ స్టార్ పవన్.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోలు
Follow us on

Pawan kalyan new look : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ త్వరలో ‘వకీల్ సాబ్’ గా థియేటర్స్ లో సందడి చేయబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యింది. వెంటనే క్రిష్ సినిమాను కూడా పట్టాలెక్కించాడు పవన్. ఈ సినిమాతో పాటు రానాతో కలిసి నటిస్తున్న సినిమాను కూడా షురూ చేసాడు. పవన్ సినిమా కోసం ఆయన అభిమానులు వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు.

ఎప్పుడెప్పుడు పవన్ ను వెండి తెరమీద చూస్తామా అని ఆసక్తి ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. ఇటీవల వకీల్ సాబ్ సినిమాకు సంబంధించిన ఫోటోలు లీక్ అవ్వడంతో సోషల్ మీడియాలో అవి వైరల్ గా మారిన విషయం తెలిసిందే. తాజాగా పవన్ న్యూ లుక్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.  ఇటీవల అదిరిపోయే లుక్ లో కనిపించరు పవర్ స్టార్. పంచకట్టులో వైట్ అండ్ వైట్ లో పవన్ లుక్ సూపర్ గా ఉంది. చార్టెడ్ ఫ్లైట్ నుంచి పంచెకట్టుతో పవన్ దిగి నడిచొస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ లుక్‌లో ప‌వ‌న్‌ని చూసిన అభిమానులు తెగ సంబరపడుతున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Krack Movie Success Meet: మాస్ మహారాజ్ ఈజ్ బ్యాక్.. ‘క్రాక్‌’ టీం సక్సస్‌ మీట్‌.. లైవ్ వీడియో..

Ram Charan tweet : నా ఫేవరెట్ హీరో రవితేజ అదరగొట్టారు.. ‘క్రాక్’ సినిమా పై ప్రసంశలు కురిపించిన చరణ్