నన్ను టచ్ చేస్తే.. సీఎం సీటు మటాష్.. జగన్‌‌కు పవన్ వార్నింగ్..!

| Edited By:

Dec 05, 2019 | 12:37 PM

జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాన్.. చిత్తూరు జిల్లా మదనపల్లెలోని మార్కెట్ యార్డును సందర్శించారు. మార్కెట్‌లోని టమాటా రైతులతో.. పవన్ ముఖాముఖి నిర్వహించారు. అక్కడ రైతులు పడుతోన్న ఇబ్బందులని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లడుతూ.. సీఎం జగన్‌పై  ఘాటు విమర్శలు చేశారు. ఈ ఆరునెలల్లో.. జగన్ చేసింది.. మాజీ ముఖ్యమంత్రి ఇల్లు కూలుద్దాం.. లేదా.. పోలవరం కాంట్రాక్టులు రద్దు చేయడమేనన్నారు. కాగా.. రైతుల కష్టాలు పట్టించుకోక పోతే.. సీఎం జగన్‌ని రైతులే కట్టేసి.. పొలం […]

నన్ను టచ్ చేస్తే.. సీఎం సీటు మటాష్.. జగన్‌‌కు పవన్ వార్నింగ్..!
Follow us on

జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాన్.. చిత్తూరు జిల్లా మదనపల్లెలోని మార్కెట్ యార్డును సందర్శించారు. మార్కెట్‌లోని టమాటా రైతులతో.. పవన్ ముఖాముఖి నిర్వహించారు. అక్కడ రైతులు పడుతోన్న ఇబ్బందులని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లడుతూ.. సీఎం జగన్‌పై  ఘాటు విమర్శలు చేశారు. ఈ ఆరునెలల్లో.. జగన్ చేసింది.. మాజీ ముఖ్యమంత్రి ఇల్లు కూలుద్దాం.. లేదా.. పోలవరం కాంట్రాక్టులు రద్దు చేయడమేనన్నారు.

కాగా.. రైతుల కష్టాలు పట్టించుకోక పోతే.. సీఎం జగన్‌ని రైతులే కట్టేసి.. పొలం దున్నిస్తారని.. నేను రైతుల్ని కలుస్తానంటే నన్ను జగన్ ఆపాలని చూసారన్నారు. నన్ను ఆపాలని చూస్తే.. మీ కుర్చీ నుంచి కిందకు దింపుతాం.. మత మార్పిడులు మీద సీఎంకు.. ఉండే దృష్టి.. రైతుల సమస్యల మీద లేదా అంటూ ప్రశ్నించారు.

అయితే.. గిట్టుబాటు ధర దొరక్క రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. సరైన ధరలేక.. రైతులందరూ.. రోడ్డున పడ్డారన్నారు. నా తరుపు నుంచి.. మీకు సరైన ధర లభించేలా కృషి చేస్తామన్నారు. రైతులకు సరైన న్యాయం జరిగేంత వరకూ.. నా వంతు కృషి చేస్తానన్నారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో టమాట రైతుల సమస్యనున పరిష్కరించాలని పవన్.. ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.