ప్రారంభమైన యాదాద్రి ప‌విత్రోత్స‌వాలు

యాదాద్రి శ్రీ ల‌క్ష్మీన‌ర‌సింహా స్వామి ఆల‌యంలో ప‌విత్రోత్స‌వాలు ప్రారంభమయ్యాయి. బుధ‌వారం(జులై 29) సాయంత్రం ప్రారంభ‌మైన ఈ ప‌విత్రోత్స‌వాలు మూడు రోజుల‌పాటు జరుగనున్నాయి. పవిత్రోత్సవంను ఆలయ పూజారులు స్వస్తి వచనాల‌తో బాలాలయంలో ప్రారంభించారు. పవిత్రోత్సవంలో భాగంగా జులై 30, 31 తేదీల్లో ఆలయంలో ప్రత్యేక సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ప‌విత్రోత్స‌వం అంటే తెలిసి గానీ, తెలియ‌క గానీ స్వామికి చేసే సేవ క‌ర్మ‌ల్లో త‌ప్పిదాలు దొర్లిన‌ట్లైతే పూజారులు మ‌న్నింపు కోరుతూ శ్రీ లక్ష్మీన‌ర‌సింహ‌స్వామికి చేసే ఆరాధ‌నే ఈ ప‌విత్రోవ్స‌వం. […]

ప్రారంభమైన యాదాద్రి ప‌విత్రోత్స‌వాలు

Updated on: Jul 29, 2020 | 10:08 PM

యాదాద్రి శ్రీ ల‌క్ష్మీన‌ర‌సింహా స్వామి ఆల‌యంలో ప‌విత్రోత్స‌వాలు ప్రారంభమయ్యాయి. బుధ‌వారం(జులై 29) సాయంత్రం ప్రారంభ‌మైన ఈ ప‌విత్రోత్స‌వాలు మూడు రోజుల‌పాటు జరుగనున్నాయి. పవిత్రోత్సవంను ఆలయ పూజారులు స్వస్తి వచనాల‌తో బాలాలయంలో ప్రారంభించారు.

పవిత్రోత్సవంలో భాగంగా జులై 30, 31 తేదీల్లో ఆలయంలో ప్రత్యేక సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ప‌విత్రోత్స‌వం అంటే తెలిసి గానీ, తెలియ‌క గానీ స్వామికి చేసే సేవ క‌ర్మ‌ల్లో త‌ప్పిదాలు దొర్లిన‌ట్లైతే పూజారులు మ‌న్నింపు కోరుతూ శ్రీ లక్ష్మీన‌ర‌సింహ‌స్వామికి చేసే ఆరాధ‌నే ఈ ప‌విత్రోవ్స‌వం. ఈ నేపథ్యంలో ఆలయంలో ఆన్‌లైన్ ద్వారా నిర్వహిస్తున్న అన్ని ఆర్జిత సేవలను 30, 31 తేదీలలో రద్దు చేస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.