PAN-Aadhaar linking Alert : పాన్ కార్డు విషయంలో ఇన్‌కం ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ చివరి వార్నింగ్ ఇచ్చింది. ఇప్పటికే ఎన్నోసార్లు ఆధార్‌ని పాన్‌తో అనుసంధానానికి సంబంధించి అనేక హెచ్చరికలు జారీ చేసి..గడువు తేదీలు పెంచినప్పటికి చాలా మంది పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో ఆధార్‌కు లింక్ చెయ్యని పాన్ కార్డులను ఇన్ ఆపరేటివ్ చేయబోతున్నట్టు ప్రకటించింది. మార్చి 31 వ తేదీని చివరి డెడ్‌లైన్‌గా ప్రకటించిన ఆదాయ పన్ను శాఖ… సెక్షన్ 139ఏఏ సబ్ సెక్షన్ (2) ప్రకరాం 2017 జూలై 1 వరకు జారీ చేసిన పాన్ కార్డులకు ఆధార్ లింకేజి తప్పనిసరని పేర్కొంది. నిర్ణీత గడువులోపు అనుసంధానం చేయని పక్షంలో..ఇన్‌కం ట్యాక్స్ న్యూ రూల్ 114ఏఏఏ ప్రకారం..ఆయా ఖాతాలను ఇన్‌ఆపరేటివ్ చేయనున్నట్లు తెలిపింది. ఈ జనవరి 27 నాటికి 30.75 కోట్ల పాన్ కార్డులు తమ ఆధార్‌లకు అనుసంధానం అయ్యాయి. ఇంకా 17.58 కోట్ల పాన్ కార్డులు, ఆధార్‌కు లింక్ కావాల్సి ఉంది.
సుప్రీంకోర్టు 2018 సెప్టెంబర్‌లో ఆధార్‌ను రాజ్యాంగబద్ధంగా చెల్లుబాటు అయ్యేదిగా ప్రకటించింది. ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేయడానికి, పాన్ కార్డుల కేటాయింపుకు బయోమెట్రిక్ ఐడి తప్పనిసరి అని పేర్కొంది.