భారత్‌ నుంచి పాక్‌కు ఔషధాలు..విచారణకు ఆదేశించిన ఇమ్రాన్‌ఖాన్‌

|

May 13, 2020 | 11:04 PM

ఇండియా‌ నుంచి 450 ప్రాణాధార మెడిసిన్ అక్రమంగా దిగుమతి అయ్యాయన్న ఆరోపణలపై ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ విచారణకు ఆదేశించారు. భారత్‌ ఆర్టికల్‌-370ని రద్దు చేసిన అనంత‌రం ఇరు దేశాల మ‌ధ్య ఎగుమ‌తులు, దిగుమ‌తులు ఆగిపోయాయి. అయితే కరోనా కారణంగా ప్రాణాధార మెడిసిన్ కొరత ఏర్పడటంతో… వాటితో పాటు మెడిసిన్ తయారీకి అవసరమైన ముడిసరకును భారత్‌ నుంచి దిగుమతికి చేసుకునేందుకు పాక్ ఫార్మా కంపెనీల‌కు ప‌ర్మిష‌న్ ఇచ్చింది. ఈ సడలింపును సాకుగా చేసుకుని భారత్‌ నుంచి విటమన్‌ మాత్రల వంటి […]

భారత్‌ నుంచి పాక్‌కు ఔషధాలు..విచారణకు ఆదేశించిన ఇమ్రాన్‌ఖాన్‌
Follow us on

ఇండియా‌ నుంచి 450 ప్రాణాధార మెడిసిన్ అక్రమంగా దిగుమతి అయ్యాయన్న ఆరోపణలపై ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ విచారణకు ఆదేశించారు. భారత్‌ ఆర్టికల్‌-370ని రద్దు చేసిన అనంత‌రం ఇరు దేశాల మ‌ధ్య ఎగుమ‌తులు, దిగుమ‌తులు ఆగిపోయాయి. అయితే కరోనా కారణంగా ప్రాణాధార మెడిసిన్ కొరత ఏర్పడటంతో… వాటితో పాటు మెడిసిన్ తయారీకి అవసరమైన ముడిసరకును భారత్‌ నుంచి దిగుమతికి చేసుకునేందుకు పాక్ ఫార్మా కంపెనీల‌కు ప‌ర్మిష‌న్ ఇచ్చింది. ఈ సడలింపును సాకుగా చేసుకుని భారత్‌ నుంచి విటమన్‌ మాత్రల వంటి ఔషధాలు దిగుమతి అవుతున్నాయంటూ మీడియాలో వార్త‌లు వచ్చాయి. ఈ విషయమై విపక్షాల నుంచి విమర్శలు వచ్చిన నేపథ్యంలో ప్ర‌ధాని ఇమ్రాన్‌ దర్యాప్తునకు ఆదేశించారు.