అక్టోబరులో భారత్‌తో యుద్ధం..పాక్‌ మంత్రి సంచలన వ్యాఖ్యలు

అక్టోబరులో భారత్‌తో యుద్ధం..పాక్‌ మంత్రి సంచలన వ్యాఖ్యలు
Indo-Pak war likely in October: Pakistan Minister

జమ్ముకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370 రద్దు తర్వాత భారత్‌పై ఎలాగైనా కక్ష సాధింపు చర్యలు చేపట్టాలని పాకిస్థాన్ ఎదురుచూస్తోంది. కానీ పరిస్థితులో అనుకూలించడం లేదు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో ఎదురుదెబ్బ తగలడం, రష్యా భారత్‌కు సపోర్ట్ చేయడం, ప్రపంచ దేశాలకు పెద్దన్న అమెరికా సైలెంట్‌గా మిన్నకుండిపోవడంతో పాక్ పగతో రగిలిపోతోంది. తాజాగా ఆ దేశ రైల్వే శాఖ మంత్రి షేక్ రషీద్ అక్టోబరు, నవంబరులో ఇరు దేశాల మధ్య పూర్తి స్థాయిలో యుద్ధం జరిగే […]

Ram Naramaneni

| Edited By:

Aug 29, 2019 | 2:31 PM

జమ్ముకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370 రద్దు తర్వాత భారత్‌పై ఎలాగైనా కక్ష సాధింపు చర్యలు చేపట్టాలని పాకిస్థాన్ ఎదురుచూస్తోంది. కానీ పరిస్థితులో అనుకూలించడం లేదు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో ఎదురుదెబ్బ తగలడం, రష్యా భారత్‌కు సపోర్ట్ చేయడం, ప్రపంచ దేశాలకు పెద్దన్న అమెరికా సైలెంట్‌గా మిన్నకుండిపోవడంతో పాక్ పగతో రగిలిపోతోంది. తాజాగా ఆ దేశ రైల్వే శాఖ మంత్రి షేక్ రషీద్ అక్టోబరు, నవంబరులో ఇరు దేశాల మధ్య పూర్తి స్థాయిలో యుద్ధం జరిగే అవకాశం ఉందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బుధవారం రావల్పిండిలో ఓ సమావేశంలో ఆయన ఈ అంశంపై మాట్లాడారు.

‘నిజంగా కశ్మీర్ అంశాన్ని పరిష్కరించాలనుకుంటే ఐరాస భద్రతా మండలి ఇప్పటికే ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించేది. ఆక్రమిత లోయలోని ప్రజల పక్షానే మేం నిల్చుంటాం. మొహర్రం తరవాత మరోసారి కశ్మీర్‌లో పర్యటిస్తాను. ఇప్పటికీ భారత్‌తో చర్చల గురించి ఆలోచించే వారు తెలివితక్కువ వారే’ అని తన నోటికి పనిచెప్పారు. అలాగే పాక్ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్ ఐరాసలో ఇవ్వబోయే ప్రసంగం గురించి ప్రస్తావించారు. ‘సెప్టెంబరు 27న ప్రధాని ఐరాసలో ఇవ్వనున్న ప్రసంగానికి అధిక ప్రాధాన్యం ఉంది. మాకు చైనా వంటి స్నేహితుడు ఉండటం మా అదృష్టం’ అని రషీద్ వ్యాఖ్యలు చేశారు.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu