పాక్ డ్రోన్‌ను కూల్చిన బీఎస్ఎఫ్ జవాన్లు.. హైఅలర్ట్

పాకిస్థాన్‌కు చెందిన ఓ డ్రోన్‌ను బీఎస్ఎఫ్ జవాన్లు కూల్చివేశారు. పంజాబ్‌ తార్న్ తారన్ జిల్లాలోని ఖేమ్ కరన్ పరిధిలో పాక్‌కు చెందిన డ్రోన్‌ను గుర్తించిన బలగాలు.. క్షణాల్లో దాన్ని కూల్చేశాయి. ఈ నేపథ్యంలో సరిహద్దు ప్రాంతాలతో పాటు ఖేమ్ కరన్ చుట్టుపక్కల ప్రాంతాల్లో హైఅలర్ట్‌ను ప్రకటించారు. అయితే ఈ ప్రాంతంలో బుధవారం రాత్రి డ్రోన్ ఎగురుతుండటం బీఎస్ఎఫ్ అధికారులు గమనించారు. వెంటనే యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ గన్‌తో దానిపై కాల్పులు జరిపారు. అయితే కూలిన డ్రోన్ భారత […]

పాక్ డ్రోన్‌ను కూల్చిన బీఎస్ఎఫ్ జవాన్లు.. హైఅలర్ట్

Edited By:

Updated on: Apr 04, 2019 | 5:19 PM

పాకిస్థాన్‌కు చెందిన ఓ డ్రోన్‌ను బీఎస్ఎఫ్ జవాన్లు కూల్చివేశారు. పంజాబ్‌ తార్న్ తారన్ జిల్లాలోని ఖేమ్ కరన్ పరిధిలో పాక్‌కు చెందిన డ్రోన్‌ను గుర్తించిన బలగాలు.. క్షణాల్లో దాన్ని కూల్చేశాయి. ఈ నేపథ్యంలో సరిహద్దు ప్రాంతాలతో పాటు ఖేమ్ కరన్ చుట్టుపక్కల ప్రాంతాల్లో హైఅలర్ట్‌ను ప్రకటించారు.

అయితే ఈ ప్రాంతంలో బుధవారం రాత్రి డ్రోన్ ఎగురుతుండటం బీఎస్ఎఫ్ అధికారులు గమనించారు. వెంటనే యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ గన్‌తో దానిపై కాల్పులు జరిపారు. అయితే కూలిన డ్రోన్ భారత భూభాగంలో పడిపోయిందా..? లేక పాక్ భూభాగంలో పడిపోయిందా..? అనే విషయం బయటకు రాలేదు. కాగా పుల్వామా ఉగ్రదాడి తరువాత భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్త పరిస్ధితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో భారత ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్ అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటున్నారు.