భారతీయ సిక్కులకు పాకిస్తాన్ ఆహ్వానం..!

|

Oct 20, 2020 | 3:57 PM

సిక్కుల ఆరాధ్య దైవం.. గురునానక్‌ దేవ్‌ 551వ జయంత్యుత్సవాలకు హాజరు కావాలని భారత్‌కి చెందిన సిక్కులను పాకిస్తాన్ ఆహ్వానించింది.

భారతీయ సిక్కులకు పాకిస్తాన్ ఆహ్వానం..!
Follow us on

సిక్కుల ఆరాధ్య దైవం.. గురునానక్‌ దేవ్‌ 551వ జయంత్యుత్సవాలకు హాజరు కావాలని భారత్‌కి చెందిన సిక్కులను పాకిస్తాన్ ఆహ్వానించింది. పంజాబ్‌ ప్రావిన్సులోని గురునానక్‌ జన్మస్థలమైన నంకానా సాహిబ్‌లో మూడు రోజుల పాటు జరిగే ఈ వేడుకలు నవంబరు 27నుంచి మొదలుకానున్నాయి. కరోనా వైరస్‌ మహమ్మారి నేపథ్యంలో భారతీయ యాత్రికులకు పాక్‌లో ఐదు రోజుల పాటు మాత్రమే గడిపేందుకు అనుమతి ఇచ్చింది. యాత్రికులు కొవిడ్‌-19 నెగటివ్‌ రిపోర్టును చూపించి రావల్సి ఉంటుందని, అలాగే కొవిడ్‌ ప్రొటోకాల్‌ని తప్పనిసరిగా పాటించాలని ఓ అధికారి సోమవారం తెలిపారు. నవంబరు 27న వాఘా సరిహద్దు చేరుకున్న వారిని అక్కడి నుంచి ప్రత్యేక బస్సులో నంకానా సాహిబ్‌కు తీసుకెళ్తామని ఆయన చెప్పారు. అయితే, ఈ సారి నంకానా సాహిబ్‌ను మాత్రమే సందర్శించేందుకు అనుమతి ఉంది. ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు అవకాశం లేదని అధికారి స్పష్టం చేశారు. కాగా, గతేడాది ప్రారంభించిన కర్తార్‌పుర్‌ కారిడార్‌ని పాకిస్తాన్ తెరిచినా.. కొవిడ్‌ నేపథ్యంలో భారత్‌ అక్కడికి యాత్రికులను అనుమతించట్లేదు.