కోవిషీల్డ్ వ్యాక్సిన్.. కేంద్రం అనుమతిస్తే.. ఒక్కో డోస్ రూ. 1000: సీరం సంస్థ చీఫ్

Serum Institute Oxford Vaccine: సీరం ఇన్‌స్టిట్యుట్ ఆఫ్ ఇండియా తయారు చేస్తోన్న 'కోవిషీల్డ్' వ్యాక్సిన్‌ను కమర్షియల్‌గా అమ్మేందుకు..

కోవిషీల్డ్ వ్యాక్సిన్.. కేంద్రం అనుమతిస్తే.. ఒక్కో డోస్ రూ. 1000: సీరం సంస్థ చీఫ్
Follow us

|

Updated on: Jan 04, 2021 | 10:14 PM

Serum Institute Oxford Vaccine: సీరం ఇన్‌స్టిట్యుట్ ఆఫ్ ఇండియా తయారు చేస్తోన్న ‘కోవిషీల్డ్’ వ్యాక్సిన్‌ను కమర్షియల్‌గా అమ్మేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతిస్తే.. ఒక్కో డోసును రూ. 1,000 అమ్ముతామని ఆ సంస్థ చీఫ్ ఆధార్ పూనావాలా తెలిపారు. ఒక్కో డోసును రూ. 200 చొప్పున తొలి పది కోట్ల డోసులను విక్రయిస్తామని.. ఆ తర్వాత టెండర్లు వేసి వేర్వేరు ధరలకు టీకాను అమ్ముతామని ఆయన అన్నారు.

”మేము కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చే డోసులన్నీ కూడా దేశ ప్రజలకు ఉచితంగా అందించనున్నారు. ఆ తర్వాత వ్యాక్సిన్‌ను ప్రైవేటు మార్కెట్‌లో విక్రయించేటప్పుడు మాత్రం ఒక్కో డోసు రూ. 1000కి ఇస్తామని సీరం సంస్థ సీఈఓ ఆధార్ పూనావాలా వెల్లడించారు. చికిత్సకు బూస్టర్ డోస్ అవసరం ఉంటుంది కాబట్టి మొత్తం ఖర్చు రూ. 2000 అవుతుందన్నారు.

క్లినికల్ ట్రయిల్స్ ఫలితాల కంటే ముందుగానే ఆక్స్‌ఫోర్డ్ యూనివర్సిటీ, ఆస్ట్రాజెనెకా అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్‌ను సీరం ఇన్‌స్టిట్యుట్ తయారు చేయడం మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. ఇప్పటిదాకా సుమారు 50 మిలియన్ మోతాదులను సిద్దం చేసింది.

”రాబోయే వారం రోజుల్లో అన్ని ఫార్మాలిటీలు పూర్తవుతాయని ఆశిస్తున్నాం. అలాగే వచ్చే నెలలో 70-80 మిలియన్ మోతాదుల వ్యాక్సిన్ సరఫరా ఉంటుందని అనుకుంటున్నాం” అని సీరం సంస్థ సీఈఓ ఆధార్ పూనావాలా తెలిపారు. కాగా, ప్రైవేట్ మార్కెట్‌లో టీకా లభ్యత అంశం మాత్రం ప్రభుత్వం నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని అన్నారు.

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో