గుడ్ న్యూస్..క‌రోనాకు అక్టోబర్​లో ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్ రిలీజ్…​!

|

Jun 25, 2020 | 3:51 PM

ప్ర‌స్తుతం ప్ర‌మాద‌క‌ర క‌రోనా వైర‌స్ విరుగుడుకు ప్ర‌భావంత‌మైన‌ వ్యాక్సిన్, మెడిసిన్ క‌నుగునేందుకు ప్ర‌పంచంలోని చాలా దేశాల సైంటిస్టులు ప్ర‌య‌త్నాలు చేస్తున్నాయి.

గుడ్ న్యూస్..క‌రోనాకు అక్టోబర్​లో ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్ రిలీజ్...​!
Follow us on

ప్ర‌స్తుతం ప్ర‌మాద‌క‌ర క‌రోనా వైర‌స్ విరుగుడుకు ప్ర‌భావంత‌మైన‌ వ్యాక్సిన్, మెడిసిన్ క‌నుగునేందుకు ప్ర‌పంచంలోని చాలా దేశాల సైంటిస్టులు ప్ర‌య‌త్నాలు చేస్తున్నాయి. ఈ క్ర‌మంలో కొన్ని సంస్థ‌లు క్లినిక‌ల్ ట్రయిల్స్ వ‌ర‌కు వెళ్లాయి. ఆక్స్‌ఫర్డ్ యూనివ‌ర్సిటీ అభివృద్ధి చేస్తున్న టీకా కూడా తుది దశకు చేరింది. ఇప్పటివరకు చేసిన ప‌రిశోద‌న‌ల్లో మెరుగైన‌ ఫలితాలు రావడం వల్ల.. అక్టోబర్​లోగా వ్యాక్సిన్ రిలీజ్ చేసేందుకు వేగంగా పనులు జరుగుతున్నాయి. ఈ విషయాన్ని జెన్నర్‌ ఇన్‌స్టిట్యూట్‌ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ అడ్రెన్‌ హిల్ వివ‌రించారు. ఆయనే ఈ ప్రాజెక్ట్‌ను లీడ్ చేస్తున్నారు. తాము తయారు చేసిన ChAdOx1 nCoV-19 టీకా చింపాజీలపై సత్ప‌లితాలు చూపిందన్నారు. ఫలితాలను ఆగస్టు లేదా సెప్టెంబర్‌ నాటికి వివ‌రిస్తామ‌న్నారు. అక్టోబర్‌ నాటికి వ్యాక్సిన్ త‌ప్ప‌కుండా మార్కెట్లోకి వస్తుందని తెలిపారు.

ఇప్పటికే ఆస్ట్రాజెనికాతో కలిసి బ్రెజిల్‌లో వాలంటీర్లపై కూడా టెస్టులు నిర్వహిస్తున్నారు. టీకా రేసులో మొద‌టిసారి ఫైనల్ స్టేజీకి చేరింది కూడా ఆక్స్‌ఫర్డే కావడం విశేషం. తుదిదశలో వాలంటీర్లను సార్స్‌కోవ్‌-2 నుంచి టీకా ఏ మేరకు సేఫ్టీ ఇస్తోందో పరిశీలించనున్నారు. సౌత్ ఆఫ్రికాలో దాదాపు 2,000 మంది ఈ టీకా ప్రయోగాల్లో పాల్గొన్నారు. ఇక బ్రిటన్‌లో 4,000 మంది వాలంటీర్లు టీకా టెస్టు కోసం నమోదు చేయించుకున్నారు. బ్రిటన్‌లోని బిజినెస్‌ సెక్రటరీ అలోక్‌ వర్మ మొద‌టిసారి కొవిడ్‌-19 టీకా తీసుకొన్న వ్యక్తిగా నిలిచారు.