18 ఏళ్లు పైబడిన 64 లక్షల మందికి కరోనా.. సెరో సర్వేలో వెల్లడి

|

Sep 18, 2020 | 6:47 PM

దేశంలో కరోనా మహమ్మారి వికృత రూపం కొనసాగుతోంది. నిత్యం కరోనా పాజిటివ్ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. భారత వైద్య పరిశోధన మండలి ఐసీఎంఆర్ ఏప్రిల్-మేలో నిర్వహించిన సెరో సర్వేలో పలు ఆసక్తికర అంశాలు వెలుగుచూశాయి.

18 ఏళ్లు పైబడిన 64 లక్షల మందికి కరోనా..  సెరో సర్వేలో వెల్లడి
Follow us on

దేశంలో కరోనా మహమ్మారి వికృత రూపం కొనసాగుతోంది. నిత్యం కరోనా పాజిటివ్ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. భారత వైద్య పరిశోధన మండలి ఐసీఎంఆర్ ఏప్రిల్-మేలో నిర్వహించిన సెరో సర్వేలో పలు ఆసక్తికర అంశాలు వెలుగుచూశాయి. 18 ఏండ్లు పైబడిన 64 లక్షల మంది కరోనా వైరస్ రాకాసి కోరల్లో చిక్కుకున్నట్లు ఎయిమ్స్‌కు చెందిన కమ్యూనిటీ మెడిసిన్ విభాగం అధిపతి డాక్టర్ సంజయ్ రాయ్ తెలిపారు. సెరో సర్వే ద్వారా వైరస్ వ్యాప్తి దిశ గురించి మాత్రమే తెలుస్తుందని, కరోనా పరీక్షల ద్వారానే వాస్తవ సంక్రమణ సంఖ్య తెలుస్తుందని ఆయన అన్నారు. దేశంలో కరోనా వ్యాక్సిన్ ట్రయల్స్ రెండో దశ జరుగుతున్నదని, ఇందుకోసం ప్రస్తుతం 600 మందికిపైగా వలంటీర్లు ముందుకు వచ్చినట్లు ఆయన వెల్లడించారు.

కరోనా నియంత్రణకు వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ విజయవంతంగా జరుగుతున్నాయన్న సంజయ్ రాయ్.. ఈ ప్రయోగాలు సత్ఫలితాలిస్తే వచ్చే ఏడాది జూన్, జూలై మధ్య ప్రపంచంలో ఎక్కడో ఒక చోట కరోనా టీకా అందుబాటులోకి వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే, అప్పటికీ టీకా వచ్చినా, రాకపోయినా అంతా సాధారణ స్థితికి వచ్చే అవకాశమున్నదని ఆయన అన్నారు. సమర్థవంతమైన వ్యాక్సిన్ అందుబాటులోకి రానంత వరకు కరోనా నివారణ చర్యలైన మాస్కులు ధరించడం, చేతుల పరిశుభ్రత, భౌతిక దూరం వంటివి పాటించాలని డాక్టర్ సంజయ్ రాయ్ పేర్కొన్నారు.