ఫ్యాకల్టీ లేమితో బోసిపోతున్న ఐఐటీ, ఎన్‌ఐటీలు

| Edited By:

Jul 09, 2019 | 1:56 PM

అత్యున్నత ప్రమాణాలతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఐఐటీలు, ఎన్‌ఐటీలు అధ్యాపకుల కొరతతో అల్లాడుతున్నాయి. బోధనా సిబ్బంది నియమకానికి తరచూ నోటిఫికేషన్లు జారీ అవుతున్నా.. అర్హులైన వారు దొరకడం లేదు. ఈ నేపథ్యంలో దేశంలో ఉన్న మొత్తం 23 ఐఐటీలలో(ఇండియన్ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్ టెక్నాలజీలో) ప్రస్తుతం 2,813 ఫ్యాకల్టీ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు మానవ వనరుల అభివృద్ధి మంత్రి రమేష్ పొక్రియల్ లోక్‌సభలో వెల్లడించారు. రెగ్యులర్ కింద మొత్తం 8,856 ఫ్యాక్టల్టీ సీట్లు ఉండగా.. అందులో 6,043మంది మాత్రమే […]

ఫ్యాకల్టీ లేమితో బోసిపోతున్న ఐఐటీ, ఎన్‌ఐటీలు
Follow us on

అత్యున్నత ప్రమాణాలతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఐఐటీలు, ఎన్‌ఐటీలు అధ్యాపకుల కొరతతో అల్లాడుతున్నాయి. బోధనా సిబ్బంది నియమకానికి తరచూ నోటిఫికేషన్లు జారీ అవుతున్నా.. అర్హులైన వారు దొరకడం లేదు. ఈ నేపథ్యంలో దేశంలో ఉన్న మొత్తం 23 ఐఐటీలలో(ఇండియన్ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్ టెక్నాలజీలో) ప్రస్తుతం 2,813 ఫ్యాకల్టీ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు మానవ వనరుల అభివృద్ధి మంత్రి రమేష్ పొక్రియల్ లోక్‌సభలో వెల్లడించారు. రెగ్యులర్ కింద మొత్తం 8,856 ఫ్యాక్టల్టీ సీట్లు ఉండగా.. అందులో 6,043మంది మాత్రమే అధ్యాపకులుగా పనిచేస్తున్నారని ఆయన లోక్‌సభలో తెలిపారు. వారిలో 149మంది ఎస్సీ, 21మంది ఎస్టీ వారు ఉన్నారని పేర్కొన్నారు.

ఇక నాన్‌ ఫ్యాకల్టీలో మొత్తం 9,465స్థానాలు ఉండగా.. వాటిలో 1,125 పోస్టులు ఎస్సీ కోసం, 520పోస్టులు ఎస్టీల కోసం రిజర్వ్‌ చేయబడ్డాయని పోక్రియల్ వెల్లడించారు. అయితే వాటిలో 888 ఎస్సీ, 275 ఎస్టీ ఫ్యాకల్టీ మాత్రమే ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్నారని.. అన్ని ఐఐటీలలో రిజర్వేషన్ నడుస్తుందని ఆయన పేర్కొన్నారు

మరోవైపు ఎన్‌ఐటీల్లోనూ అదే పరిస్థితి కొనసాగుతోందని రమేష్ పొక్రియెల్ చెప్పారు. మొత్తం ఎన్‌ఐటీలలో 7,413 అధ్యాపకుల పోస్టులు ఉండగా.. వాటిలో 4,202 మంది మాత్రమే అధ్యాపకులుగా పనిచేస్తున్నారని.. ఇంకా 3,211 ఖాళీలుగా ఉన్నాయని అన్నారు. ఇక నాన్‌ ఫ్యాకల్టీలలో 8,163 స్థానాలు ఉంటే.. 3,817మంది మాత్రమే విధుల్లో ఉన్నారని ఆయన అన్నారు. వీలైనంత త్వరగా వీటిని భర్తీ చేయాలని సంబంధిత అధికారులను తాము కోరినట్లు పోక్రియల్ చెప్పుకొచ్చారు.